సొంత జిల్లాలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అండగా మైక్రోసాఫ్ట్ సీఈవో.. త్వరలోనే మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్

First Published Aug 5, 2021, 11:20 AM IST

అనంతపురం: అమెరికన్ టెక్నాలజి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్య నాదెళ్ల   అకాడమిక్ ఎక్స్ పర్ట్స్, ఇంటెలెక్చువాల్స్ రిప్రెసెంటేషన్ లో  తన సొంత జిల్లా అనంతపురంలో వెనుకబడిన ప్రాంతాలలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల స్కిల్స్ మెరుగుపరిచేందుకు  'మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్' స్థాపించడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించారు.  
 

గత సంవత్సరం మరణించిన సత్య నాదెళ్ల తండ్రి బి.ఎన్. యుగంధర్ జ్ఞాపకార్థంతో ఒక  ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని రిప్రెసెంటేషన్ లో వారు ప్రతిపాదించారు. సత్య నాదెళ్ల అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన వాడు. సత్య నాదెళ్ల తండ్రి పేరు బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, అతను 1962 బ్యాచ్ ఐ‌ఏ‌ఎస్ అధికారి ఇంకా సివిల్ సర్వెంట్స్ కి మార్గదర్శకుడు. బి.ఎన్. యుగంధర్ తరచుగా తన స్వగ్రామాన్ని సందర్శించేవాడు అలాగే తన తుది శ్వాస వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు. సత్య నాదెళ్ల కుటుంబానికి సొంత గ్రామంలో భూములు ఉన్నందున తన తండ్రితో కలిసి బుక్కాపురాన్ని తరచుగా సందర్శించేవాడు.

సత్య నాదెళ్ల కుటుంబం కొన్ని నెలల క్రితం జిల్లాలోని ఎస్‌హెచ్‌జి గ్రూపుల ద్వారా మహిళా సాధికారత కోసం రూ .2 కోట్లు అందించారు.ఇంజనీరింగ్ అండ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లలో 90 శాతానికి పైగా నిరుద్యోగులు ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకుని వారి స్కిల్స్ వివిధ విభాగాలకు సంబంధించినవిగా ఉండాలని, వారికి ఉపాధి కల్పించేలా సరైన శిక్షణ ఇవ్వాలి అని డాక్టర్ సురేష్ బాబు అన్నారు.
 

"మైక్రోసాఫ్ట్  ప్రతిఒక్కరికీ అలాగే సంస్థల కోసం వర్క్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించగలదు. మొదట దీనిని ఒకొక్కరితో ప్రారంభించి, తదుపరి దశలో సంస్థలతో ఎం‌ఓ‌యూలు కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్‌లు పొందని విద్యార్థులు మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఏదైనా శిక్షణా కోర్సును ఎంచుకోవచ్చు, ”అని రిప్రెసెంటేషన్ లో  వివరించారు. ఇక్కడ అందించే కోర్సులు పరిశ్రమ, ఉద్యోగం ఆధారితంగా ఉండాలి.
 

ఉదాహరణకు బి. టెక్ కోర్సులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అన్ని బ్రాంచీలకు సాధారణం, దీనిని ఒక సెమిస్టర్‌ మొత్తం బోధిస్తారు. కానీ ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లలో నెల రోజుల కోర్సు సి కోసం శిక్షణ పొందుతున్నారు.

డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్‌లు పొందని విద్యార్థులు మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఐటి శిక్షణ కోర్సును ఎంచుకోవచ్చు. ఈ సంస్థ
పరిశ్రమ-నిర్దిష్ట శిక్షణను, దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ కారణంగా ఈ కోర్సులను అందిస్తుంది. చిన్న చిన్న తరగతి గదుల్లో కేవలం నిత్యావసరాలతో ఈ కోర్సులను బోధించవచ్చు. ఇన్నోవేషన్ సెంటర్ కోసం భూమి, మౌలిక సదుపాయాలను అందించడానికి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జే‌ఎన్‌టి‌యూ అనంతపురం సిద్ధంగా ఉన్నాయి.

సత్య నాదెళ్ల బంధువు మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్  కూడా సత్య నాదెళ్ల పరిశీలన కోసం రిప్రెసెంటేషన్ పంపినట్లు అనంతపురం నిపుణుల బృందానికి తెలియజేశారు.

click me!