ఈ రోజుల్లో కార్లు రోజురోజుకూ అప్ డేట్ అవుతూ మార్కెట్ ని పరుగులు పెట్టిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలు కూడా మారుతున్న నేపథ్యంలో కార్ల కంపెనీలు వివిధ రకాల కార్లు తయారు చేస్తున్నారు. వినియోగదారుల అవసరాల మేరకు SUVలో 7 సీటర్, 5 సీటర్ కార్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా టాటా కంపెనీ అనేక రకాల కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
అలా మార్కెట్ లోకి తీసుకొచ్చిన కారే టాటా నెక్సాన్ SUV. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, బలమైన భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఫీచర్లు, ఇంజిన్, ధర, ఆకర్షణీయమైన డిజైన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఫీచర్లు, భద్రత
నెక్సాన్ లో టాటా కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ మీకు అన్ని సౌకర్యాలను సింపుల్ గా ఆపరేట్ చేసేలా చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, పవర్‌ఫుల్ మ్యూజిక్ సిస్టమ్, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటర్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెగ్‌రూమ్, బూట్ స్పేస్ వంటి అదనపు ఫీచర్లు కూడా అప్ డేట్ చేసి ఇందులో ఏర్పాటు చేశారు.
సేఫ్టీ ఫీచర్లతో పాటు వెంటిలేటర్ సీట్లు, 6 ఎయిర్‌బ్యాగులు కూడా ఉన్నాయి. ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు, గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ కూడా ఉన్నాయి.
టాటా నెక్సాన్ ధర
టాటా నెక్సాన్ ధర మార్కెట్ లో రూ.8 లక్షల నుండి రూ.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. XE, XM, XZ, XZ+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
పవర్‌ఫుల్ ఇంజిన్
నెక్సాన్ లో 1.2 లీటర్ పెట్రోల్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను టాటా అందించింది. ఇది 120 PS పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డీజిల్ ఇంజిన్ 1.5 లీటర్, ఇది 115 PS పవర్, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ AMT గేర్‌బాక్స్ మోడ్ వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి. మంచి మైలేజ్ ఇచ్చే ఈ కారు CNG వేరియంట్‌లో కూడా లభిస్తుంది.