తక్కువ ధర, నమ్మకమైన పనితీరు, మంచి మైలేజ్ కావాలంటే మీరు హోండా కంపెనీ బైకులను ఓ సారి పరిశీలించండి. స్టైలిష్ బైక్‌ల నుండి రోజువారీ అవసరాలకు ఉపయోగించే బైక్‌ల వరకు అన్ని రకాల అవసరాలకు తగ్గట్టుగా హోండా బైక్‌లు తయారు చేశారు. వాటిల్లో ముఖ్యంగా హోండా షైన్, యూనికార్న్, SP 125 బైక్‌లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ బైకుల ఫీచర్లను ఇక్కడ పరిశీలిద్దాం.
హోండా SP 125
ఇప్పుడు చాలా బైకుల ధర రూ.లక్షకు పైగానే ఉంటోంది. కాని కేవలం రూ.87,410 నుండి రూ.91,960 (ఎక్స్-షోరూమ్) ధరలో లభించే హోండా SP 125 స్టైలిష్ బైకు అధునాతన ఫీచర్లతో మార్కెట్ లో వినియోగదారులకు బెస్ట్ బైక్ గా మారింది. ఇది 123.94cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 10.87 bhp శక్తిని, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ధరే కాకుండా SP 125 60 kmpl మైలేజ్‌ను కూడా అందిస్తుంది.