విశ్రాంతి తీసుకోవడానికి రైల్వే స్టేషన్లలోనే తక్కువ ధరకే లగ్జరీ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు హోటళ్లతో పోలిస్తే ఇక్కడ అద్దె చాలా తక్కువ ఉంటుంది. ఈ రూమ్‌లలో ఏసీ, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. కాని ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. ట్రైన్ ఆలస్యంగా వస్తోందని తెలిస్తే విశ్రాంతి తీసుకోవడానికి దగ్గర్లో హోటల్స్ వెతుకుతారు. వారు గంటల చొప్పున కూడా అద్దె వసూలు చేస్తారు. అది కూడా చాలా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఈజీగా తక్కువ ధరకే ఏసీ రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
రైల్వే స్టేషన్‌లోనే తక్కువ ధరకే లభించే ఈ లగ్జరీ రూమ్స్ లో సౌకర్యాలు హోటల్ రూమ్స్‌లో ఉండే సౌకర్యాలకంటే ఏమాత్రం తక్కువ ఉండవు. హోటళ్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ప్రయాణికులకు లగ్జరీ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, ఇతర సౌకర్యాలు ఈ రూమ్‌లలో ఉంటాయి. వీటి అద్దె రూ.100 నుండి రూ.700 వరకు ఉంటుంది.
రైల్వే స్టేషన్ లో రూమ్స్ బుక్ చేసుకోవడం వల్ల ఖరీదైన హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. డబ్బు, సమయం ఆదా అవుతుంది. ప్రయాణికులకు ఈ రూమ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రయాణం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఈ రూమ్‌లు చాలా బాగుంటాయి. కొన్ని గంటలు ఉండి రెస్ట్ తీసుకోవాలనుకున్న వారికి కూడా ఉపయోగపడతాయి. రెంట్ కూడా తక్కువగానే ఉంటుంది.
IRCTC రిటైరింగ్ రూమ్ బుకింగ్
మీరు గాని రైల్వే స్టేషన్ లో రూమ్ బుక్ చేయాలనుకుంటే ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఈజీగా రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు.
ముందుగా మీ ఐఆర్‌సిటిసి అకౌంట్‌లో లాగిన్ అవ్వండి.
మై బుకింగ్స్ సెక్షన్‌కి వెళ్లండి.
రిటైరింగ్ రూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
మీ ప్రయాణ వివరాలు, వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
మీరు ఎంచుకున్న సమయాన్ని బట్టి పేమెంట్ చేయండి.
రిటైరింగ్ రూమ్‌ల ఫెసిలిటీ చాలా రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. అందువల్ల ప్రయాణికులు హోటళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రూమ్‌లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. తక్కువ బడ్జెట్ తో ప్రయాణం చేయాలనుకున్న వారికి కూడా ఈ రూమ్ ఫెసిలిటీ చాలా మంచి ఆప్షన్.