ఇండియాలో ముఖ్యమైన వాణిజ్య బ్యాంకుల్లో కెనరా బ్యాంకు ఒకటి. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో 1906లో ఈ బ్యాంకును స్థాపించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఈ బ్యాంకును స్టార్ట్ చేసింది ఒక న్యాయవాది. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ బ్యాంకుగా అవతరించింది.
కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10, 2025 నుంచి కొన్ని ప్రత్యేక కాలపరిమితి FD రేట్లలో మార్పులు చేశారు. వాటి ప్రకారం రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై కొత్త రేట్లు వర్తిస్తాయి. సాధారణ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనీసం 4% నుంచి గరిష్టంగా 7.25% వరకు వడ్డీ వస్తుంది.
పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
FD అంటే తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి. సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీ ప్రయోజనం కలుగుతుంది. ఇందులో 12 నుంచి 24 నెలల FD స్కీమ్ ఎక్కువ రాబడిని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 8.80% వరకు రాబడి ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఇదే. మార్కెట్లో ఉన్న ఇతర బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లకు గట్టి పోటీని ఇస్తోంది.
ఇప్పుడే FDలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
కెనరా బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, కొన్ని కాలపరిమితి FDలపై చాలా ఆకర్షణీయమైన రాబడిని ఇస్తానని చెబుతోంది. ఫిక్స్‌డ్, సురక్షిత రాబడి కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అని చెప్పొచ్చు. మీరు రిస్క్ లేకుండా స్థిరమైన రాబడిని కోరుకుంటే కెనరా బ్యాంక్ FD ఒక నమ్మకమైన ఎంపిక అవుతుంది. ముఖ్యంగా 12 నుంచి 24 నెలల FDపై వచ్చే వడ్డీ రేట్లు ప్రస్తుతం మార్కెట్లో టాప్‌లో ఉన్నాయి. కానీ పెట్టుబడి పెట్టే ముందు ఎప్పటికప్పుడు మారుతున్న రేట్లు, మీ ఆర్థిక ప్రణాళికను తప్పకుండా చెక్ చేసుకోండి.