Stock: స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ఏడాదిలో 1760 శాతం పెరిగి మల్టీబ్యాగర్ గా నిలిచింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.18.60 లక్షలుగా మార్చిన ఈ స్టాక్, తాజాగా దక్కించుకున్న భారీ ఎనర్జీ డీల్ కారణంగా మార్కెట్లో దూసుకుపోతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి అనూహ్యంగా కోలుకున్న తరుణంలో, ఒక డిఫెన్స్ స్టాక్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ధర ఏడాది వ్యవధిలో కళ్ళు చెదిరే లాభాలను అందించింది.
25
ఒక్క ఏడాదిలో 1760 శాతం లాభం!
ఈ స్టాక్ గత ఏడాది కాలంలో సుమారు 1760 శాతం పెరగడం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లు పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి ఏకంగా రూ.18.60 లక్షలకు చేరుకుంది. గత సెషన్‌లో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ.1791.40 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది.
35
స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం
కంపెనీ షేరు ధర ఇంతలా దూసుకుపోవడానికి ఇటీవల దక్కిన భారీ ఆర్డర్ కారణమని తెలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి అమ్మోనియా డ్యూయల్ ఫ్యూయల్ బల్క్ క్యారియర్ ఆర్డర్‌ను ఈ కంపెనీ దక్కించుకుంది. ఎనర్జీవన్ లిమిటెడ్ నుంచి ఈ డీల్ రావడంతో మార్కెట్లో ఈ స్టాక్ పట్ల సానుకూల వాతావరణం నెలకొంది.
గత రెండు రోజులుగా మార్కెట్ హెచ్చుతగ్గుల్లో కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ద ప్రభావం మార్కెట్ పై ఉన్నప్పటికీ.. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్ ను పైకి లేపుతున్నారు. అయితే మరికొద్ది రోజులు ఆగితేనే గానీ మార్కెట్ పయనం ఎలా ఉంటుందో చెప్పలేమని బిజినెస్ నిపుణులు అంటున్నారు.