Havells Air Cooler: సగం ధరకే భారీ ఎయిర్ కూలర్, వాడనప్పుడు టేబుల్‌గా మార్చేసుకోవచ్చు

Published : Mar 25, 2026, 01:32 PM IST

Havells Air Cooler: వేసవి తీవ్రత పెరిగిపోతుండడంతో కూలర్లు, ఏసీలు కొనేవారు అధికంగా ఉన్నారు. 80 లీటర్ల పెద్ద ట్యాంకుతో వచ్చే కన్వర్టిబుల్ డిసర్ట్ ఎయిర్ కూలర్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. హావెల్స్ కి చెందిన ఈ భారీ కూలర్ సగం ధరకే వస్తోంది. 

PREV
13
సగం ధరకే కూలర్

మండే ఎండల్లో కూలర్ కొనాలనుకుంటున్నారా? పెద్ద కూలర్ 50 శాతం డిస్కౌంట్‌తో సగం ధరకే వస్తోంది. హావెల్స్ సంస్థకు చెందిన ఈ కూలర్ 80 లీటర్ల నీటిని పట్టే పెద్ద ట్యాంకుతో వస్తుంది. దీన్ని మీరు వాడినంత సేపు కూలర్‌లా వాడుకోవచ్చు. మిగతా సమయాల్లో టేబుల్‌గా మార్చుకోవచ్చు. అందుకే దీన్ని కన్వర్టిబుల్ డెసర్ట్ ఎయిర్ కూలర్ అని పిలుస్తారు. హాల్లో లేదా పెద్ద పెద్ద గదులు ఉన్నవారికి ఈ కూలర్ సరిగ్గా సరిపోతుంది. పెద్ద ట్యాంకు ఉండటం వల్ల తరచూ నీళ్ళు నింపాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి నిండితే గంటల పాటు ఇది గదిని చల్లగా ఉంచుతుంది.

23
ధర ఎంత?

దీని అసలు ధర 27,490 రూపాయలు. కానీ ప్రస్తుతం సగం ధరకే అంటే 13,490 రూపాయలకే లభిస్తోంది. ఈ కూలర్ లో ఉన్న పవర్ ఫుల్ ఎయిర్ డెలివరీ సిస్టమ్ వల్ల గది మొత్తం చాలా త్వరగా చల్లబడిపోతుంది. వేడి అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగపడుతుంది. 5 లీఫ్ మెటల్ బ్లేడ్ ఫ్యాన్ ఉండడం వల్ల గాలి బలంగా రావడమే కాదు.. దీర్ఘకాలం పనిచేస్తుంది. డబుల్ బేరింగ్ మోటర్ ఉపయోగించడం వల్ల మోటార్ జీవిత కాలం కూడా అధికంగానే ఉంటుంది. అదే సమయంలో శబ్దం కూడా చాలా తక్కువగా చేస్తుంది. రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వాడుకోవచ్చు.

33
టేబుల్ మార్చేయండి

ఈ కూలర్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని సైడ్ టేబుల్‌లా మార్చి వాడుకోవచ్చు. ఇంట్లో స్థలం ఆదా చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట మాత్రమే కూలర్ కావాలనుకునేవారు ఉదయం అంతా దీన్ని టేబుల్‌లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూలర్ గా వాడితే పెద్ద సైజులో కనిపిస్తుంది. కాబట్టి అది వాడనప్పుడు చిన్న టేబుల్ గా మార్చేసుకోవడం మంచిది. కాబట్టి ఎంతో సౌకర్యంగా ఉండే ఎయిర్ కూలర్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఏసీ లేకుండా కూలింగ్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories