ఆరోజు రూ. ల‌క్ష పెట్టుబ‌డి పెట్టుంటే.. ఈరోజు రూ. 14 కోట్లు అయ్యేవి. స్టాక్ మార్కెట్ మ్యాజిక్ అంటే ఇదే

Published : May 07, 2026, 03:45 PM IST

Stock: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటే ప్రత్యేక ఆకర్షణ. చిన్న మొత్తాన్ని భారీ సంపదగా మార్చే ఇలాంటి షేర్లు చాలా అరుదు. అలాంటి అరుదైన స్టాక్స్‌లో ఒకటి వేదంతా గ్రూప్‌న‌కు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌. 

PREV
15
రూ.1 లక్ష పెట్టుబడి ఇప్పుడు ఎంత అయిందంటే?

ఈ కంపెనీ షేర్ గత 24 ఏళ్లలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడులు ఇచ్చి కోట్లాది రూపాయల సంపదను సృష్టించింది. 2002లో హిందుస్తాన్ జింక్ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ సుమారు రూ.14 కోట్లకు చేరినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ షేర్ 24 ఏళ్లలో దాదాపు 1400 రెట్లు రాబడి ఇచ్చినట్టే.

ఈ కంపెనీ సుమారు 33 శాతం CAGR రాబడిని పెట్టుబడిదారులకు అందించింది. దీర్ఘకాల పెట్టుబడిలో ఓపికగా ఉండే వారికి షేర్ మార్కెట్ ఎంతటి సంపదను సృష్టించగలదో ఈ స్టాక్ మరోసారి నిరూపించింది.

25
ప్రభుత్వ కంపెనీ నుంచి ప్రైవేట్ దిగ్గజంగా ఎదిగిన హిందుస్తాన్ జింక్

హిందుస్తాన్ జింక్ మొదట ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. 2002లో కేంద్ర ప్రభుత్వం కంపెనీలోని 26 శాతం వాటాను అనిల్ అగర్వాల్‌కు చెందిన స్టెర్లైట్ ఇండస్ట్రీస్‌కు రూ.445 కోట్లకు విక్రయించింది. తర్వాత ఈ సంస్థ వేదాంత గ్రూప్‌లో భాగమైంది. ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. జింక్, లీడ్, సిల్వర్ ఉత్పత్తుల్లో ఈ కంపెనీ కీలక స్థానాన్ని సంపాదించింది.

35
డివిడెండ్ ఇవ్వడంలో కూడా కంపెనీ ముందంజ

హిందుస్తాన్ జింక్ కేవలం షేర్ ధర పెరుగుదలతోనే కాదు.. భారీ డివిడెండ్లు ఇవ్వడంలో కూడా పెట్టుబడిదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. కంపెనీ తన లాభాల్లో పెద్ద భాగాన్ని షేర్ హోల్డర్లకు డివిడెండ్ రూపంలో పంచుతోంది.

2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి డివిడెండ్‌గా కంపెనీ ఒక్కో షేర్‌పై రూ.11 ప్రకటించింది. అంతకుముందు కూడా వరుసగా మంచి డివిడెండ్లు చెల్లించింది. 2025-26లో ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్ ప్రకటించగా.. 2024-25లో రెండు విడతల్లో కలిపి రూ.29 డివిడెండ్ ఇచ్చింది. అలాగే 2023-24లో రూ.13 డివిడెండ్ చెల్లించింది.

45
ప్రస్తుతం షేర్ పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ షేర్ ధర సుమారు రూ.630 నుంచి రూ.645 మధ్య ట్రేడవుతోంది. ఈ ధర ఆధారంగా చూస్తే కంపెనీ డివిడెండ్ యీల్డ్ దాదాపు 3.26 శాతం నుంచి 3.47 శాతం వరకు ఉంది. డివిడెండ్ ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు కూడా ఈ స్టాక్ మంచి ఎంపికగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు ఎప్పుడూ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.

55
మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు

ఇలాంటి భారీ రాబడులు ఇచ్చే స్టాక్స్ చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి కేవలం గత రాబడులు చూసి పెట్టుబడి పెట్టడం సరైంది కాదు. కంపెనీ వ్యాపారం, లాభాలు, భవిష్యత్ అవకాశాలు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించాలి. దీర్ఘకాలంలో ఓపికగా పెట్టుబడి కొనసాగించిన వారికి మంచి కంపెనీలు భారీ సంపదను సృష్టించగలవని హిందుస్తాన్ జింక్ మరోసారి నిరూపించింది.

Read more Photos on
click me!

Recommended Stories