EPFO: ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పొందే వారికి PPO నంబర్ ఎంతో ముఖ్యమైంది. అయితే చాలామంది ఈ నంబర్‌ను మర్చిపోవడం లేదా ఎక్కడో పోగొట్టుకుంటారు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి.? PPO నంబర్‌ను తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(EPFO) ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద ప్రతి పెన్షనర్‌కు ప్రత్యేకంగా 12 అంకెల సంఖ్యను కేటాయిస్తుంది. దీనినే PPO అంటే Pension Payment Order నంబర్ అని పిలుస్తారు. ఈ నంబర్ ద్వారా పెన్షన్ చెల్లింపులు, బ్యాంక్ రికార్డులు, జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలు నిర్వహిస్తారు. పెన్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఈ నంబర్‌తో లింక్ అయ్యి ఉంటాయి. అందుకే PPO నంబర్ చాలా కీలకంగా భావిస్తారు.
25
EPFO వెబ్‌సైట్‌లో PPO నంబర్ ఎలా తెలుసుకోవాలి?
PPO నంబర్‌ను తిరిగి పొందడానికి ముందుగా అధికారిక EPFO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత పెన్షనర్స్ పోర్టల్ లేదా “Know Your PPO Number” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత PPO నంబర్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. EPFO ఇప్పుడు ఈ ప్రక్రియను చాలా సులభంగా మార్చడంతో పెన్షనర్లు ఇంటి నుంచే ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
35
PPO నంబర్ తెలుసుకోవడానికి ఏ వివరాలు అవసరం?
PPO నంబర్ తెలుసుకోవడానికి కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. పెన్షన్‌కు అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ నంబర్, EPF నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భద్రత కోసం క్యాప్చా కోడ్ కూడా నమోదు చేయాలి. ఈ సమాచారం EPFO రికార్డులతో సరిపోతేనే మీ PPO నంబర్ తిరిగి డిస్‌ప్లే అవుతుంది. అందువల్ల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయడం అవసరం.
అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయాలి. మీరు ఇచ్చిన సమాచారం సరైందిగా ఉంటే వెంటనే స్క్రీన్‌పై PPO నంబర్ కనిపిస్తుంది. అదే సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో కూడా పంపించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈమెయిల్‌కు కూడా PPO వివరాలు వస్తాయి. దీంతో భవిష్యత్తులో మళ్లీ అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
55
PPO నంబర్‌ను భద్రంగా ఎలా ఉంచుకోవాలి?
చాలామంది PPO నంబర్ తెలుసుకున్న తర్వాత మళ్లీ దాన్ని మర్చిపోతుంటారు. అందుకే ఈ నంబర్‌ను భద్రంగా సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక డైరీలో రాసుకోవడం, మొబైల్‌లో సేవ్ చేసుకోవడం లేదా ఈమెయిల్‌కు పంపించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ఈ వివరాలు షేర్ చేసుకుంటే అవసర సమయంలో ఉపయోగపడుతుంది. ఇంకా ఏవైనా సమస్యలు ఎదురైతే సమీప EPFO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్‌లైన్ ద్వారా కూడా సహాయం పొందే అవకాశం ఉంది.