Published : Mar 26, 2025, 02:06 PM ISTUpdated : Mar 26, 2025, 02:07 PM IST
సమ్మర్ వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటనే భయపడే పరిస్థితి ఉంది. దీంతో కూలర్లను, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎయిర్ కూలర్స్, వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Hindware Smart Appliances: హిండ్‌వేర్ కంపెనీకి చెందిన ఈ కూలర్ అసలు ధర రూ. 8,990 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 4699కి లభిస్తోంది. ఈ కూలర్ 25 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ స్వింగ్ కంట్రోల్, 3 స్పీడ్ కంట్రోల్స్, ఐస్ ఛాంబర్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే డస్ట్ ఫ్రీ ఫిల్టర్ టెక్నాలజీ ఈ కూల్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. దీంతో స్వచ్ఛమైన చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు.
25
Symphony-Ice-Cube
Symphony Ice Cube:
సింఫనీ కంపెనీకి చెందిన ఈ కూలర్ అసలు ధర రూ. 7,999కాగా అమెజాన్‌లో 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 5499కి లభిస్తోంది. ఇందులో ఐ ప్యూర్ టెక్నాలజీని అందించారు. 27 లీటర్ కెపాసిటీ ఈ కూలర్ సొంతం. ఇక ఈ కూలర్ తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. ఏడు కిలోల బరువున్న ఈ కూలర్ 95 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
35
Havells-Kalt-Pro
Havells Kalt Pro 17 L:
తక్కువ ధరలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే సరిపోయేలా కూలర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ కూలర్ అసలు ధర రూ. 8,790కాగా అమెజాన్‌లో 51 శాతం డిస్కౌంట్‌తో రూ. 4299కి లభిస్తోంది. ఈ కూలర్‌లో 3 సైడ్ బ్యాక్టీరియా షీల్డ్ హనీకాంబ్ పాడ్స్‌ను ఇచ్చారు. 530 క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ ఎయిర్ ఫ్లో కెపాసిటీ ఈ కూలర్ సొంతం. ఇందులో 17 లీటర్ల కెపాసిటీతో కూడి ట్యాంక్‌ను ఇచ్చారు. 6.8 కిలోలు ఉండే ఈ కూలర్ 90 వాట్స్ పవర్‌కు సపోర్ట్ చేస్తుంది.
45
Bajaj-PX25-Torque
Bajaj PX25 Torque:
ఈ కూలర్ అసలు ధర రూ. 7,700 కాగా అమెజాన్‌లో 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 4699కి లభస్తోంది. ఈ కూలర్‌లో 24 లీటర్ల కెపాసిటీతో కూడిన ట్యాంక్‌ను ఇచ్చారు. 16 పీట్ పవర్‌ఫుల్ ఎయిర్ త్రో ఫీచర్‌ను ఇచ్చారు. కంపెనీ ఈ కూలర్‌పే ఏకంగా 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. యాంటీ బ్యాక్టీరియాల్ ఫిల్టర్ ఈ కూలర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 6.3 కిలోల బరువుండే ఈ కూలర్ 100 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. టర్బో ఫ్యాన్ టెక్నాలజీ, 4 వే స్వింగ్ డిఫ్లిక్షన్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.
55
Havells-Kalt-24L
Havells Kalt 24L:
ఈ కూలర్ అసలు ధర రూ. 8,790కాగా అమెజాన్‌లో 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 4599కి లభిస్తోంది. ఈ కూలర్‌ను 24 లీటర్ల కెపాసిటీతో తీసుకొచారు. కూలర్‌పై కంపెనీ ఏడాది మ్యానిఫాక్షరింగ్ వారంటీని అందిస్తోంది. ఇక ఈ కూలర్‌లో 8E+2 CMPH ఎయిర్ ఫ్లో కెపాసిటీతో ఈ కూలర్‌ను తీసుకొచ్చారు. దీని బరువు 7 కిలోలు ఉంటుంది. అలాగే ఈ కూలర్ 230 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది.