Recharge plans: ఏడాదికి 12 నెలలైతే మనం 13 నెలలకు రీఛార్జ్‌ చేస్తున్నాం.? ఎలాగో తెలుసా.?

Published : Mar 26, 2025, 12:11 PM ISTUpdated : Mar 26, 2025, 02:13 PM IST

ప్రస్తుతం ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే ఫోన్‌లే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తప్పకుండా రీఛార్జ్‌ చేయాల్సిందే. అయితే రీఛార్జ్‌ల విషయంలో కంపెనీలు ఫాలో అయ్యే ఓ ఆసక్తికరమైన లాజిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
Recharge plans: ఏడాదికి 12 నెలలైతే మనం 13 నెలలకు రీఛార్జ్‌ చేస్తున్నాం.? ఎలాగో తెలుసా.?
Recharge plans

ఒకప్పుడు సిమ్‌ కార్డు తీసుకుంటే లైఫ్‌ టైమ్‌ ఇన్‌కమ్‌ ఉచితంగా ఉండేది. ఒకవేళ ఎవరికైనా కాల్‌ చేయాలంటేనే రీఛార్జ్‌ చేసుకునే వాళ్లం. ఇన్‌కమ్‌ కాల్స్‌ మాత్రం ఉచితంగా వచ్చేవి. అయితే ప్రస్తుతం టెలికం కంపెనీలు రూటు మార్చాయి. ఇన్‌కమ్‌ కాల్స్‌ రావాలన్నా కచ్చితంగా యాక్టివ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ఉండేలా మార్పులు చేశాయి. యాక్టివ రీఛార్జ ప్లాన్‌ లేకపోతే ఇన్‌కమ్‌ కాల్స్‌ను కూడా నిలిపివేస్తున్నాయి. 

24

కొన్ని నెలల పాటు సిమ్‌ను అలాగే పక్కన పెడితే సిమ్‌ డీ యాక్టివేట్‌ కూడా చేస్తున్నాయి కంపెనీలు. దీంతో కచ్చితంగా ఏదో ఒక ప్లాన్‌తో రీఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రీఛార్జ్‌ ప్లాన్ వ్యాలిడిటీలను గమనిస్తే 28 రోజులు, 56 రోజులుగా ఉంటాయి. ఏ కంపెనీ అయినా నెల రోజుల ప్లాన్‌ను ఇవ్వవు. అయితే దీని వెనకాల ఉన్న లాజిక్‌ ఏంటో తెలుసా.? 
 

34

ఉదాహరణకు మీరు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో ప్రతీ నెల రీఛార్జ్‌ చేస్తూ వెళ్తున్నారని అనుకుందాం. ఈ లెక్కన చూస్తే మీరు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్‌ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే ఏడాదికి 12 నెలలు ఉంటే మీర మాత్రం 13 నెలలకు రీఛార్జ్‌ చేస్తున్నారన్నమాట. ఇలా వ్యాలిడిటీని తగ్గించడం వల్ల ఏడాదికి 13 నెలల పాటు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. టెలికం కంపెనీలు లాభాలను పెంచుకునేందుకు తీసుకొచ్చిన ట్రిక్‌ ఇది. దాదాపు అన్ని కంపెనీలు ఇదే ఫార్ములాను ఉపయోగిస్తుంటాయి. 
 

44

అందుకే చాలా మంది ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్‌ వైపు మొగ్గు చూపుతారు. అయితే వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ 28 రోజుల వ్యాలిడిటీతో పోల్చుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో యూజర్లు కొంతమేర లబ్ధిపొందుతారు. ఇదండీ టెలికం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీ వెనకాల ఉన్న అసలు ఉద్దేశం. 
 

Read more Photos on
click me!

Recommended Stories