ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. గృహ రుణలపై వారికి ప్రత్యేక ఆఫర్..

First Published May 3, 2021, 1:32 PM IST

దేశీయ  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్లకు ఒక గుడ్‌న్యూస్‌ అందించింది. కరోనా మహమ్మారి యుగంలో  గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా  తెలిపింది. ఎస్‌బిఐలో గృహ రుణలు తీసుకునేవారికి వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి  ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. 

కరోనా మహమ్మారి యుగంలో గృహ వినియోగదారులకు ఈ చర్య ద్వారా ఎంతో ఉపశమనం లభించనుంది. ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు రూ. 30 లక్షలకు అయితే 6.70 శాతం , రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు అయితే 6.95 శాతం, రూ. 75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతంతో గృహ రుణాలు లభిస్తాయని తెలిపింది. అలాగే గృహ రుణ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభమయ్యే ఏకైక బ్యాంకుగా ఎస్‌బి‌ఐ మారిందని తెలిపింది.
undefined
ఈ సందర్భంగా ఎస్‌బి‌ఐ ఎండీ సీఎస్‌ శెట్టి(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) మాట్లాడుతూ ఎస్‌బీఐ హోమ్ ఫైనాన్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంటూ, గృహ రుణ మార్కెట్లో కస్టమర్లను సంతృప్తి పరచడానికి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లతో ఖాతాదారులకు రుణాలను తీసుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ఈ చర్యతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు వెనుదన్నుగా నిలుస్తుంద" అన్నారు.
undefined
దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ పరిమితుల దృష్ట్యా పోస్ట్ లేదా రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ద్వారా పంపిన పత్రాల నుండి ఇప్పుడు కే‌వై‌సి కూడా అప్ డేట్ చేయబడుతుందని వెల్లడించింది.కే‌వై‌సి అప్‌డేట్ కావడానికి వినియోగదారులు ఇకపై బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని, అలాగే 2021 మే 31 వరకు కెవైసి అప్‌డేట్ కాకపోయినా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని ఎస్‌బి‌ఐ తెలిపింది.బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని, 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని, బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొంది.
undefined
ఎస్‌బిఐ గృహ రుణలపై మహిళలకు ప్రత్యేక తగ్గింపుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మహిళల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఒక మహిళ గృహ రుణం కోసం దరఖాస్తు చేస్తే ఆమెకు 5 బేసిస్ పాయింట్ల (0.05 శాతం) తగ్గింపు లభిస్తుంది. అలాగే గృహ రుణ వినియోగదారులకు యోనో యాప్ ద్వారా రుణం తీసుకుంటే ఐదు బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు లభిస్తుంది. డిజిటల్ ప్రోత్సాహకాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బిఐ తెలిపింది.
undefined
click me!