ఇండియాలోనే అతిపెద్ద మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తిగా ఆర్‌ఐ‌ఎల్.. రాష్ట్రాలకు ఉచితంగా సప్లయి..

Ashok Kumar   | Asianet News
Published : May 03, 2021, 12:26 PM IST

 భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ని అరికట్టేందుకు  ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యలలో ఒకటైన ఆక్సిజన్ కొరతను పరిష్కరించడానికి  రిలయన్స్ ఇండస్ట్రీ  ముందుకు వచ్చింది. కరోనా రోగుల చికిత్స కోసం అందించే మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ లభ్యతపై హామీ ఇచ్చింది.  

PREV
14
ఇండియాలోనే అతిపెద్ద మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తిగా  ఆర్‌ఐ‌ఎల్.. రాష్ట్రాలకు ఉచితంగా సప్లయి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేందుకు  కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆర్‌ఐఎల్ కోవిడ్-19 సెకండ్ వేవ్ మధ్య మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ ప్రొడ్యూసర్‌గా మారినట్లు తెలిపింది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు సున్నా నుండి 1,000 మెట్రిక్ టన్నులకు పెంచింది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో  వేగవంతమైన సప్లయి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
 
నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్  మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ తయారీ సంస్థ కాదు. అయినప్పటికీ కరోనా మహమ్మారి వ్యాప్తి ముందు నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రాణాలని రక్షించే వనరుగా భారతదేశ అతిపెద్ద ఉత్పత్తిదారిగా మారింది ”అని ఆర్‌ఐ‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది." జామ్ నగర్, ఇతర సౌకర్యాలలోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నుండి ఆర్‌ఐ‌ఎల్ ఇప్పుడు రోజుకు 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే భారతదేశం మొత్తం ఉత్పత్తిలో ఇది 11 శాతానికి పైగా ఉంటుంది అని సంస్థ తెలిపింది.

24

ప్రతిరోజూ లక్ష మందికి పైగా రోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ఈ ఆక్సిజన్‌ను భారతదేశంలోని పలు రాష్ట్రాలకు ఉచితంగా  అందిస్తున్నట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. అధిక-స్వచ్ఛత కలిగిన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి  రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్స్ గ్రేడ్ ఆక్సిజన్  కార్యకలాపాలను పునర్నిర్మించి, ఆప్టిమైజ్ చేసినట్లు కూడా తెలిపింది. దీనిపై  ఆర్ఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ  మాట్లాడుతూ“ కోవిడ్ -19 మహమ్మారి సెకోండ్ వేవ్ తో పోరాడుతున్న ప్రతి ప్రాణాన్ని రక్షించడం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కోసం భారతదేశంలో ఉత్పత్తి, రవాణా సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త సవాలును ఎదుర్కోవటానికి జామ్ నగర్ లోని మా ఇంజనీర్లు  చాలా కష్టపడి పనిచేచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ” అని అన్నారు.
 
34

"మన దేశం అపూర్వమైన సంక్షోభంలో ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మేము చేయగలిగే ప్రతి సహాయం చేస్తూనే ఉంటాము. ప్రతి జీవితం విలువైనది. ఇండియాలో  ఆక్సిజన్ సప్లయి అందిస్తున్న జామ్ నగర్ రిఫైనరీలోని  మా ప్లాంట్ మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పునర్నిర్మించబడింది.  అందరం కలిసి ఈ కష్ట సమయాన్ని అధిగమీస్ధం ”అని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ అన్నారు.భారత ప్రభుత్వ సంబంధిత నియంత్రణ సంస్థ అయిన పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోసివ్స్ సేఫ్టీ సంస్థ (పి‌ఈ‌ఎస్‌ఓ) ఆమోదించిన ప్రక్రియల ద్వారా నైట్రోజన్ ట్యాంకర్లను మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సప్లయి కోసం రవాణా ట్రక్కులుగా మార్చారు.
 
44

అదనంగా 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి సౌదీ అరేబియా, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, థాయిలాండ్ నుండి 24 ఐఎస్ఓ కంటైనర్లను భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నట్లు  తెలిపింది.  ఈ కంటైనర్లు దేశంలోని మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ రవాణా అవరోధాలను తొలగించడంలో సహాయపడతాయి. ఐఎస్ఓ కంటైనర్లను అందించడంలో, రవాణా చేయడంలో సహకరించినందుకు అరాంకో, బిపి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) లకు ఆర్ఐఎల్ కృతజ్ఞతలు తెలిపింది.

click me!

Recommended Stories