ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ ఒక్క రోజు సెక్యూరిటి ఖర్చు ఎంతో తెలుసా.. మరి సంవత్సరానికి ?

First Published Apr 12, 2021, 5:30 PM IST

ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం కంపెనీ కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తుందట. ఈ విషయం ఒక కొత్త నివేదిక ద్వారా వెల్లడైంది. 

2020లో మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఫేస్‌బుక్ 23 మిలియన్ డాలర్లు అంటే సుమారు 171 లక్ష రూపాయలు ఖర్చు చేసింది. అంటే మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఒక రోజుకి సుమారు 46 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఫేస్‌బుక్ ఈ సమాచారాన్ని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కి తెలిపింది.
undefined
ఎక్కడ, ఎలా ఎంత ఖర్చు అవుతుంది?2020 సంవత్సరంలో మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం 171 కోట్లు ఖర్చు చేశారు, అందులో 99 కోట్లు తన ఇల్లు, వ్యక్తిగత భద్రత కోసం ఖర్చు చేశారు. మిగిలిన 72 కోట్లు అదనపు భద్రత, ప్రీ టాక్స్ ఆలోవెన్స్ కోసం సహా ఖర్చు చేశారు. ముఖ్యంగా కోవిడ్ -19 ట్రావెల్ ప్రోటోకాల్, యు.ఎస్ ఎన్నికల సమయంలో భద్రతా కారణంగా మార్క్ జుకర్‌బర్గ్ భద్రతా వ్యయం పెరిగిందని ఒక నివేదిక పేర్కొంది.
undefined
ఫేస్‌బుక్ సిఇఒపై ఈ ఖర్చులను అవసరాన్ని బట్టి, సమయం ప్రకారం వెచ్చిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్క్ జుకర్‌బర్గ్ వార్షిక వేతనంగా 1 డాలర్ మాత్రమే తీసుకుంటాడు. తనకి బోనస్, ఈక్విటీ అవార్డులు లేదా ఇతర భత్యాలు అలాంటివి అందవు.
undefined
533 మిలియన్ల ఫేస్‌బుక్ వినియోగదారుల ప్రైవేట్ డేటా ఇటీవల హ్యాకర్ల ఫోరమ్‌లో లీక్ అయిన సంగతి మీకు తెలిసిందే. ఈ డేటా లీక్‌లో సుమారు 106 దేశాల వినియోగదారుల డేటా ఉంది. ఫేస్‌బుక్ చరిత్రలో ఇది అతిపెద్ద డేటా లీక్ అని కొందరు చెబుతున్నారు. అయితే ఈ డేటా ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచారు.
undefined
ఈ 106 దేశాల ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాలో 32 మిలియన్ల అమెరికా యూజర్ల డేటా, 11 మిలియన్ల యుకె యూజర్లు, 6 మిలియన్ల ఇండియన్ యూజర్ల డాటా ఉంది. లీకైన డేటాలో ఫేస్‌బుక్ వినియోగదారుల పుట్టిన తేదీలు, పూర్తి పేర్లు, బయో, లొకేషన్, ఇ-మెయిల్ మొదలైనవి ఉన్నాయి. చాలా మంది వినియోగదారుల ఫోన్ నంబర్లు కూడా లీక్ అయ్యాయి.
undefined
click me!