కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఒక్క నిమిషం ఆగండి. ఈ-కామర్స్ (E-commerce) ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో ఇప్పుడు భారీ సేల్స్ నడుస్తున్నాయి… కాబట్టి కొన్ని ట్రిక్స్, కూపన్లతో ఫోన్లను సగం ధరకే కొనొచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ ఈ-కామర్స్ (E-commerce) ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ప్రస్తుతం సమ్మర్ సేల్స్ కొనసాగుతున్నాయి. అమెజాన్ ''గ్రేట్ సమ్మర్ సేల్'', ఫ్లిప్ కార్ట్ ''ససా లేలే సేల్'' పేరిట భారీ తగ్గింపు ధరకే విక్రయాలు చేపడుతున్నాయి. కాబట్టి కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్... కొన్ని ఫోన్లు ఏకంగా 50 శాతం తగ్గింపు ధరతో లభిస్తున్నాయి.
25
డిస్కౌంట్ ఎలా పొందాలి..?
ఫోన్ కొనే ముందు ప్రొడక్ట్ పేజీలో 'Apply Coupon' బాక్స్‌ను చెక్ చేయడం మర్చిపోవద్దు.
మీరు వెబ్‌సైట్ బదులు మొబైల్ యాప్‌లో కొంటే మీకు ప్రత్యేకమైన వోచర్లు (యాప్-ఓన్లీ వోచర్లు) దొరుకుతాయి. ఇవి ఫైనల్ బిల్లును మరింత తగ్గిస్తాయి.
ఈ కూపన్లు, వోచర్ల సాయంతో రూ.20,000 రేంజ్ ఫోన్ల ఫైనల్ ధర సుమారు రూ.10,000 కు తగ్గించుకోవచ్చు.
35
బ్యాంక్ ఆఫర్లతో ఫోన్‌పై మరింత ఆదా
కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు, మీ దగ్గర సరైన బ్యాంక్ కార్డు ఉంటే మరో 10% వరకు అదనంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్‌లో SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కార్డు వాడితే వెంటనే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో Axis Bank కార్డు ఉన్నవారికి అదిరిపోయే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
ఈ సమ్మర్ సేల్ భారీ తగ్గింపు ధరతో ఫోన్లు అందుబాటులో ఉన్నా మీ దగ్గర సరిపడా డబ్బులు లేవా..? ఏం పర్వాలేదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించకున్నా ఫోన్ పొందవచ్చు. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాది నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు… అంటే నెలనెలా కొంతమొత్తం చెల్లించాలన్నమాట. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు… కొంత సర్వీస్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. ఇలా మీపై పెద్దగా భారం పడకుండానే కొత్త ఫోన్ చేతికి వస్తుంది.
55
ఎక్స్చేంజ్ ఆఫర్..
కేవలం కూపన్లు, వోచర్లు, బ్యాంక్ ఆఫర్లే కాదు… మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా కొత్తఫోన్ ధరను తగ్గించుకోవచ్చు. ఇది చాలా తెలివైన పని. రెండు ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లి మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ (Exchange Value) చెక్ చేయండి. ఎక్కడ ఎక్కువ ధర వస్తే, అక్కడే డీల్ ఫైనల్ చేయండి. ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్ కలిపితే ప్రీమియం ఫోన్ల ధర కూడా మీ బడ్జెట్‌లోకి వచ్చేస్తుంది.
ఈ-కామర్స్ సంస్థల ఈ సమ్మర్ సేల్ సమయంలో ప్రతి కొన్ని గంటలకు 'లైట్నింగ్ డీల్స్' వస్తుంటాయి. ఇవి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. మీరు బెస్ట్ డీల్స్ మిస్ అవ్వకూడదనుకుంటే, ఫోన్‌లోని యాప్‌లో నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కార్ట్‌లో వేసి, కూపన్ అప్లై చేసి, ఈ అదిరిపోయే సేల్ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.