Business Ideas: చాలా మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా, భారీ పెట్టుబడి అవసరమని వెనకడుగు వేస్తుంటారు. అయితే, సరైన ప్రణాళికతో కేవలం రూ. 1 లక్షతో కూడా విజయవంతమైన వ్యాపారాలను నిర్మించవచ్చని మీకు తెలుసా..
ముఖ్యంగా వేసవి కాలంలో జ్యూస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక మంచి రద్దీగా ఉన్న ప్రాంతంలో చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. దీనికి అవసరమైన మిక్సీలు, గ్లాసులు వంటి సామాగ్రిని కొత్తవి లేదా సెకండ్ హ్యాండ్‌లో(OLX వంటి వాటిలో) కొనుగోలు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.
25
ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ (Fast Food Business)
ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను కూడా రూ. 1 లక్షలోపు ప్రారంభించవచ్చు. స్టవ్, గ్యాస్, ఇతర సామాగ్రిని ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపుల దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. నాణ్యమైన రుచిని అందించగలిగితే కస్టమర్లు పెరుగుతారు.
35
టిఫిన్ సెంటర్ (Tiffin Center)
కేవలం రూ. 50,000 పెట్టుబడితో కూడా టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరే స్వయంగా వంట చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి, లేదంటే మాస్టర్‌కు ఇచ్చే జీతం వల్ల ప్రాఫిట్ కొంత తగ్గే అవకాశం ఉంది.
ముగ్గురు నలుగురు పనివారితో ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని ఇళ్లకు లేదా ఆఫీసులకు క్లీనింగ్ సర్వీసెస్ అందించవచ్చు. మీరు ఒక మేనేజర్‌లా ఉండి కస్టమర్లను అప్రోచ్ అవుతూ ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు.
55
డోర్ స్టెప్ కార్/బైక్ వాష్ (Car & Bike Wash)
షెడ్ వేసి వాష్ సెంటర్ పెట్టడం కంటే, అవసరమైన పరికరాలతో కస్టమర్ ఇంటి వద్దకే వెళ్లి వాష్ చేసే సర్వీస్ బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్‌మెంట్లలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లతో మంచి ఆదాయం పొందవచ్చు.