వెండి ధరలు పెరగడానికి పలు ఆర్థిక, పారిశ్రామిక, భౌగోళిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి:
పారిశ్రామిక వినియోగం పెరుగుదల:
వెండి ప్రధానంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగపడుతోంది. గ్రీన్ ఎనర్జీ విప్లవంతో దీనిపై డిమాండ్ బలంగా పెరిగింది.
భౌగోళిక ఉద్రిక్తతలు:
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు, చైనాలో ఇన్వెస్ట్‌మెంట్ బలహీనత, అమెరికాలో ముడి ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రపంచ వ్యాప్తంగా వెండిని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి.
అంతర్జాతీయ మార్కెట్ ర్యాలీ:
2012 ఫిబ్రవరి తర్వాత తొలిసారి వెండి ధర ఔన్స్‌కు 37 డాలర్లను దాటడం మార్కెట్‌ను ఉత్సాహపరిచింది. ఇది భారత మార్కెట్‌లో వెండి రేట్లను పరుగులు పెట్టించింది.