Silver Prices: బంగారం కంటే వెండి ధరలే వేగంగా పెరుగుతున్నాయి, ముందే కొని పెట్టుకోవడం ఉత్తమం

Published : Sep 18, 2025, 02:23 PM IST

బంగారు, వెండి (Silver) ధరలు ఇప్పుడు అధికంగా పెరుగుతున్నాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరలే పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెండిని ముందుగానే కొని పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

PREV
15
వెండి, బంగారం ధరలు

భారతదేశంలో వెండికి, బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెండి పళ్లాలలో తినేవారు, వెండి స్పూన్లను వాడేవారి సంఖ్య ఎక్కువే. అలాగే బంగారాన్ని కూడా ఎంతో విలువైనదిగా మన దేశంలో పరిగణిస్తారు. అయితే వెండి, బంగారం ధరలు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు వాటిని ఇప్పుడే కొని పెట్టుకోవడం ఉత్తమం.

25
వెండి ధరలు ఎలా పెరుగుతున్నాయి?

ఈ సంవత్సరం వెండి 43 శాతం పెరిగితే, బంగారం 37 శాతం పెరిగింది. దీన్ని బట్టి చూస్తే బంగారంతో పోలిస్తే వెండి ధరలే చాలా త్వరగా పెరుగుతున్నాయి. కాబట్టి వెండిని ఇప్పుడే కొని పెట్టుకుంటే మంచిది. భవిష్యత్తులో వెండి ధరలే మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

35
పారిశ్రామికంగా డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా వెండి బంగారం విషయంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. రాబోయే నెలలో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వెండిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. పారిశ్రామికంగా కూడా వెండికి డిమాండ్ ఉంది. బంగారం, వెండి ధరలు ఇప్పుడు అస్థిరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎంత ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి.

45
వెండి గనులు మూసివేత

ఇండోనేషియా, చిలీ వంటి ప్రదేశాలలో వెండి గనులు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం మూసివేశారు. దీంతో వెండి ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గింది. ఇక భవిష్యత్తులో ఇలాగే ఉంటే పరిస్థితి మరింతగా వెండి సరఫరా తగ్గుతుందని భావిస్తున్నారు. కాబట్టి వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

55
వెండిపైనే పెట్టుబడులు

ఈ ఏడాది పెట్టుబడిదారులంతా బంగారం, వెండి వైపుగా దృష్టి సారిస్తున్నారు. బంగారం, వెండిపై పెట్టే పెట్టుబడులపై రిస్క్ చాలా తక్కువ. అందుకే వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. బంగారంతో పోలిస్తే వెండి అతి తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి వెండిని కూడా పెట్టుబడుల రూపంలో మారుస్తున్నారు. కాబట్టి వెండి ధర కూడా పెరుగుతూ వస్తోంది. మీ అవసరానికి తగ్గట్టు వెండిని ఇప్పుడే కొని పెట్టుకుంటే భవిష్యత్తులో ఎక్కువ ధర ఇచ్చి కొనాల్సిన అవసరం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories