భవిష్యత్తుల్లో వెండికి భారీగా డిమాండ్ పెరగనుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బలాన్ని చేకూరుస్తూ వెండి ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా గురువారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
ఇప్పటి వరకు అందరి దృష్టి బంగారంపైనే ఉండేది. అయితే ఇప్పుడు వెండి ధరలు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కిలో వెండి ధర లక్ష దాటేసి పరుగులు పెడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,14,000గా ఉంది. భారత్‌లో వెండికి భారీ డిమాండ్ పెరుగుతోంది. కమోడిటీ మార్కెట్‌లో ఒక్కరోజే రూ.3,016 పెరగడం గమనార్హం.
25
వెండి ధర పెరుగుదలకు కారణాలేంటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా ఈ క్రింది అంశాలే ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు:
పారిశ్రామిక డిమాండ్ పెరగడం
అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు
పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరగడం
35
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు
వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనమవుతుంది. దీని ప్రభావం వెండి ధరలపై ప్రత్యక్షంగా పడుతుంది. దీంతో పాటు సెప్టెంబర్ నాటికి వెండి కిలో ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వెండికి ఉన్న పారిశ్రామిక అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో, ఎలక్ట్రిక్ వాహనాల్లో, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి ఉపయోగం అనివార్యంగా మారుతోంది. ఈ రంగాలన్నీ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుండటంతో వెండి వినియోగం పెరిగింది. ఇది వెండి ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
55
అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా
అమెరికాలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం. చైనా-అమెరికా వాణిజ్య అస్థిరత, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలన్నీ అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లకు భయాన్ని పెంచుతున్నాయి. దీంతో వారంతా వెండిని ‘సురక్షిత ఆస్తి’గా చూస్తూ పెట్టుబడి పెడుతున్నారు.