Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు

Published : Dec 20, 2025, 06:05 PM IST

Silver ETF: వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే రా సిల్వర్‌తో స‌మానంగా ఈటీఎఫ్‌ల‌కు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇంకీ సిల్వ‌ర్ ఈటీఎఫ్ అంటే ఏంటి.? ఎలా కొనుగోలు చేయాలి.? 

PREV
15
సిల్వ‌ర్ ఈటీఎఫ్ అంటే ఏంటి.?

Silver ETF అనేది వెండి ధరను అనుసరించే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. దీనిని షేర్ మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకం చేయవచ్చు. వెండి నాణేలు లేదా బిస్కెట్లు కొనకుండా, వాటి విలువకు సమానమైన ETF యూనిట్లను మీరు కొనుగోలు చేస్తారు. వెండి ధర పెరిగితే ETF విలువ కూడా పెరుగుతుంది. వెండి ధర తగ్గితే ETF విలువ కూడా తగ్గుతుంది. స్టోరేజ్, భద్రత, శుద్ధత లాంటి సమస్యలు లేకుండా వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సులభమైన మార్గం.

25
ఎలా పనిచేస్తుంది?

మీ డీమ్యాట్ ఖాతా ద్వారా Silver ETF యూనిట్లు కొనుగోలు చేస్తారు. మీరు పెట్టిన డబ్బును ఫండ్ హౌస్ వెండి లేదా వెండితో సంబంధం ఉన్న సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక్క యూనిట్ ధర రూ.70గా ఉన్నప్పుడు 100 యూనిట్లు కొంటే మొత్తం పెట్టుబడి రూ.7,000 అవుతుంది. వెండి ధర 10 శాతం పెరిగితే ETF విలువ కూడా దాదాపుగా రూ.7,700కి చేరుతుంది. అవసరమైతే మార్కెట్ టైమ్‌లో ఎప్పుడైనా వీటిని అమ్ముకోవచ్చు.

35
Silver ETFలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు

Silver ETF చిన్న మొత్తంతో పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారికి చాలా ఉపయోగకరం. ఫిజికల్ వెండి కొనాలంటే కనీసం కొన్ని గ్రాములు కొనాల్సి వస్తుంది. కానీ ETFలో వందల రూపాయలతోనే పెట్టుబడి మొదలుపెట్టొచ్చు. మార్కెట్ ఓపెన్‌ ఉన్న సమయంలో ఎప్పుడైనా కొనచ్చు, అమ్మచ్చు. ధర పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. దొంగతనం, నిల్వ సమస్యలు, వెండి శుద్ధతపై ఆందోళన ఉండదు.

45
Silver ETFలో ఉన్న ఇబ్బందులు

Silver ETFలో పెట్టుబడి పెట్టడంలో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. వెండికి ఇండస్ట్రీల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండటంతో ధరల్లో వేగంగా మార్పులు రావచ్చు. కొన్నిసార్లు ETF ధర, అసలు వెండి ధరతో స్వల్ప తేడా చూపించవచ్చు. ఇక ETF ద్వారా వెండి కొంటే ఫిజికల్ వెండిని డెలివరీగా తీసుకునే అవకాశం ఉండదు. అయినప్పటికీ దీర్ఘకాల పెట్టుబడిగా చూస్తే ఇది మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.

55
ప్రముఖ Silver ETFలు ఇవే..

భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ Silver ETFలు ఇవి:

* నిప్పాన్ ఇండియా Silver ETF

* ICICI ప్రుడెన్షియల్ Silver ETF

* ఆదిత్య బిర్లా సన్ లైఫ్ Silver ETF

* HDFC Silver ETF

* కోటక్ Silver ETF

గోల్డ్‌తో పాటు మరో లోహంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే Silver ETF మంచి డైవర్సిఫికేషన్ ఇస్తుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫిజికల్ వెండి సమస్యలు లేకుండా, సులభంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి Silver ETF ఒక నమ్మదగిన ఎంపికగా నిలుస్తుంది.

గమనిక: పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని తప్పకుండా పరిశీలించాలి. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories