అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ కేసు నమోదయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో జై అన్మోల్ అంబానీ చదువు, కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు తెలుసుకోండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ మనవడు, అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ కేసు నమోదయ్యింది. యూనియన్ బ్యాంక్ కు రూ.228 కోట్ల మేర నష్టాన్ని చేసేలా రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) వ్యవహరించిందంటూ ఆ బ్యాంకు అదికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్ అన్మోల్ పై సిబిఐ కేసు నమోదు చేసింది.
ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అన్మోల్ అంబానీ పేరు వెలుగులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ కొడుకులు ఆకాశ్, అనంత్ అంబానీలు నిత్యం వార్తల్లో ఉంటారు కాబట్టి వారిగురించి అందరికీ తెలుసు. అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ గురించి మొదటిసారి బయటకు వచ్చింది. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
25
అన్మోల్ అంబానీ విద్యాబ్యాసం
భారతీయ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ 1991 డిసెంబర్ 12న ముంబైలో పుట్టారు. ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో, తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి బీఎస్సీ డిగ్రీ పొందారు.
35
జై అన్మోల్ అంబానీ కెరీర్: 18 ఏళ్లకే కెరీర్ ప్రారంభం
జై అన్మోల్ చిన్న వయసులోనే కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్లకే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. 2014లో రిలయన్స్ గ్రూప్‌లో చేరారు. ఆయన నికర ఆస్తి విలువ $3.3 బిలియన్లు.
అన్మోల్ అంబానీ రిలయన్స్ పదవి: వ్యాపారంలో కీలక పాత్ర
అనిల్ అంబానీ వ్యాపారాన్ని గాడిలో పెట్టడంలో అన్మోల్ కీలక పాత్ర పోషించారు. 2019లో జై అన్మోల్, జై అన్షుల్ రిలయన్స్ ఇన్‌ఫ్రా బోర్డులో చేరారు. వారి హయాంలో కంపెనీ షేర్లు 40% పెరిగాయి.
55
జై అన్మోల్ అంబానీ వ్యక్తిగత జీవితం, విలాసవంతమైన జీవనశైలి
అన్మోల్ అంబానీ సోషల్ మీడియాలో తక్కువగా ఉంటారు. అతడు కృష్ణా షాను పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని 17 అంతస్తుల 'అబోడ్' భవనంలో ఉంటారు. ఆయనకు రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.