SBI Home Loans: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ సమయంలో తన వినియోగదారులకు ప్రోత్సహించేందుకు SBI కూడా ప్రధాన రుణ వడ్డీ రేట్లను 0.50% వరకు తగ్గించింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్.
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) అనేది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో SBI కూడా తన ప్రధాన రుణ వడ్డీ రేట్లను 0.50% వరకు తగ్గించింది.
జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు, SBI తాజా రుణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
25
ప్రస్తుతం SBI EBR 8.15 %
రెపో రేటు తగ్గింపు బాహ్య బెంచ్‌మార్క్ రేటు(EBR), బాహ్య బెంచ్‌మార్క్ రుణ రేటు (EBLR), రెపో లింక్డ్ రుణ రేటు (RLLR)తో సహా వివిధ రుణ లింక్డ్ బెంచ్‌మార్క్‌లను ప్రభావితం చేస్తుంది.
జూన్ 15, 2025 నుండి బాహ్య బెంచ్‌మార్క్ రేటు (EBR) 8.65% నుండి 8.15%కి తగ్గింది. EBR అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించిన విధంగా హోమ్ లోన్లు, MSME రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయించే రేటు. ఇది 0.50% తగ్గడంతో హోమ్ లోన్స్, కుటీర పరిశ్రమల లోన్స్ వడ్డీరేట్లు తగ్గుతాయి.
35
SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
లోన్ తీసుకొనే వారి సిబిల్(CIBIL) స్కోర్‌ను బట్టి SBI హోమ్ లోన్ వడ్డీ రేటు 7.50% నుండి 8.45% వరకు మారుతుంది.
SBI హోమ్ లోన్ Maxgain OD వడ్డీ రేటు 7.75% నుండి 8.70% వరకు మారుతుంది.
టాప్ అప్ హోమ్ లోన్ కోసం వడ్డీ రేటు 8% నుండి 10.50% వరకు మారుతుంది. ఈ రేట్లు జూన్ 15, 2025 నుండి అమలులోకి వచ్చాయి.
SBI అందించే అన్ని హోమ్ లోన్లు బాహ్య బెంచ్‌మార్క్ రుణ రేటు (EBLR)తో లింకై ఉన్నాయి. ప్రస్తుత EBLR 8.15 % ఉంది.
హోమ్ లోన్ మొత్తంలో 0.35% ప్రాసెసింగ్ ఫీజుగా SBI వసూలు చేస్తుంది. రెండూ GST మినహాయిస్తే కనీసం రూ.2,000 నుండి గరిష్టంగా రూ.10,000 వరకు కట్టాల్సి ఉంటుంది.
అంతే కాకుండా హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. CIBIL స్కోర్ బాగుండాలి. ఇది సాధారణగా 300 నుండి 900 వరకు ఉంటుంది. మీ స్కోర్ 900కి ఎంత దగ్గరగా ఉంటే మీ క్రెడిట్ రేటింగ్ అంత మెరుగ్గా ఉందని అర్థం.
55
CIBIL స్కోర్ అంటే ఏమిటి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ పొందిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) అత్యంత ప్రజాదరణ పొందింది. అంటే ప్రతి అకౌంట్ హోల్డర్ లావాదేవీలను సిబిల్ పరిశీలించి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. దాన్ని బట్టి బ్యాంకులు లోన్ ఎంత ఇవ్వాలన్న విషయాన్ని నిర్ధారించుకుంటాయి.
సిబిల్ లాంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలుగా పనిచేసేవి మరో మూడు కంపెనీలు ఉన్నాయి. అవి ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, హైమార్క్. ఇవి కూడా RBI లైసెన్స్ పొందాయి.