మరోకొద్ది గంటల్లో నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు.. ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో, యుపిఐ సేవలకు బ్రేక్..

Ashok Kumar   | Asianet News
Published : May 21, 2021, 03:14 PM IST

 మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో అక్కౌంట్ ఉందా.. అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. మీరు ఏదైనా అత్యవసర లావాదేవీలు చేయవల్సి వస్తే ఇప్పుడే  చేసేయండి, ఎందుకంటే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్‌బి‌ఐ  డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజు రాత్రికి కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండదు. 

PREV
15
మరోకొద్ది గంటల్లో నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు.. ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో, యుపిఐ సేవలకు బ్రేక్..

ఎస్‌బిఐ  ట్వీట్ ద్వారా దీని గురించి సమాచారం ఇచ్చింది. ఈ సమయంలో మీరు ఎస్‌బి‌ఐ ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యుపిఐ సేవలను ఉపయోగించుకోలేరు. మే 21 నుండి మే 23 మధ్య, రెండుసార్లు సేవలు నిలిపివేయబడుతుంది.
 
25

ఎస్‌బి‌ఐ  అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా, 'వినియోగదారులకు నిరంతరాయంగా బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి మే 21 రాత్రి 10:45 నుండి మే 22 రాత్రి 10:00  వరకు వినియోగదారులకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. అలాగే మే 22 ముగిసిన తరువాత 23 మే 2021న మధ్యాహ్నం 2.40 నుండి 24 ఉదయం 6.10 వరకు నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్ మరియు యుపిఐ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
 
35

మే 7 అలాగే 8 తేదీలలో సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
అంతకుముందు మే 7 అలాగే మే 8న నిర్వహణ సంబంధిత పనుల కారణంగా ఎస్‌బి‌ఐ కొన్ని సేవలు ప్రభావితమయ్యాయి. 7 మే 2021 రాత్రి 10.15 నుండి 8 మే2021 రాత్రి 8.45 వరకు దీన్ని  అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు, యోనో, యోనో లైట్, యుపిఐ సేవలు అందుబాటులో లేవు. 
 
45

ఎస్‌బి‌ఐ ఐ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశంలో 22,000 కి పైగా శాఖలు, 57,889 ఎటిఎంలు ఉన్నాయి. 31 డిసెంబర్ 2020 నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య   8.5 కోట్లు, మొబైల్ బ్యాంకింగ్  ఉపయోగిస్తున్న వినియోగదారుల సంఖ్య  1.9 కోట్లు. బ్యాంక్ యుపిఐని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 135 మిలియన్లు.
 
55

బ్యాంక్ కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది.
కరోనా వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులను తెరవాలని సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను అమలు చేసింది. ఎస్‌బిఐ శాఖలు ఇప్పుడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్‌బి‌ఐ శాఖలలో వినియోగదారులకు నాలుగు ప్రాధమిక సేవలు అందించబడతాయి.

1. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్
2.చెక్ సౌకర్యం
3.డ్రాఫ్ట్, ఆర్‌టి‌జి‌ఎస్ అండ్ ఎన్‌ఈ‌ఎఫ్‌టి 
4.ప్రభుత్వ చలాన్ సంబంధిత పనులు

click me!

Recommended Stories