ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)సేవలు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే పొందవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయింపు, యాక్టివేషన్ వంటి సేవలకు యాజమాన్యం ( HR) అనుమతి అవసరం లేదు. ఉమాంగ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ల ద్వారా స్వయంగా యూఏఎన్ పొందవచ్చు,
స్టార్ట్ ఫోన్ ఉండే చాలు.. పీఎఫ్ సేవలు చాలా స్మార్ట్ గురూ..
EPFO Update:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యుల కోసం పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయింపు, యాక్టివేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఉద్యోగికి ఈ సర్వీసులను స్మార్ట్ గా పొందవచ్చు. అది కూడా యాజమాన్యం ( HR) అనుమతి అవసరం లేకుండానే. అది ఎలాగో తెలుసుకుందాం.
26
హెచ్ ఆర్ ఫర్మిషన్ కి బై బై
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లేదా ఇప్పటికీ UAN లేని వారు ఇకపై HR అనుమతిని ఆశ్రయించాల్సిన పనిలేదు. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే UAN పొందే, యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). కంపెనీ యాజమాన్యం లేదా EPFO కార్యాలయంపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు.
36
ఈ రెండు యాప్స్ ఉండే చాలు..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)సేవలు పొందాలంటే మీ ఫోన్‌లో రెండు ముఖ్యమైన యాప్స్ అవసరం. 1.ఉమాంగ్ యాప్ (UMANG), 2. ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ (UIDAI Face RD App). ఈ రెండు యాప్‌లతో మీరు పూర్తి ప్రక్రియను పూర్తిచేయవచ్చు. భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు, నేపాల్, భూటాన్ పౌరుల విషయంలో మాత్రం కంపెనీ యాజమాన్యం ద్వారానే UAN కేటాయింపు, యాక్టివేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ముందుగా ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి యూఏఎన్ అలాట్మెంట్ (UAN Allotment)లింక్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తిచేయండి. ఆ తరువాత మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది . దానిని ఎంటర్ చేసి ధృవీకరించండి. ఆధార్‌తో లింక్ ఉన్న UAN ఉంటే తెలియజేస్తుంది. లేకుంటే ఫేస్ అథెంటికేషన్ చేయాలని సూచిస్తుంది. ఆ తరువాత ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాత కొత్త UAN నెంబర్ SMS రూపంలో వస్తుంది
56
UAN ఎలా యాక్టివేట్ చేయాలి?
ఉమాంగ్ యాప్‌లో UAN Activation సెక్షన్‌కు వెళ్లండి. ఆ తరువాత UAN నంబర్, ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్ కు OTP వస్తుంది. దాని ఎంటర్ చేసి ధృవీకరించండి. తదుపరి ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి. ఫోన్‌కు టెంపరరీ పాస్‌వర్డ్ వస్తుంది. ఇలా యూఎఎన్ నెంబర్ యాక్టివ్ అవుతుంది.
66
ఇతర సేవలూ ఫోన్‌లోనే
ఇతర సేవలకు కూడా ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ప్రధానంగా UAN పాస్‌బుక్ తనిఖీ, KYC అప్‌డేట్, క్లెయిమ్ అప్లికేషన్, ఇలా ప్రాథమిక సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.
ఏవైనా సమస్యలైతే? టెక్నికల్ ఇబ్బందులు ఎదురైతే ఉమాంగ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. వారి సపోర్ట్ టీమ్ తక్షణమే స్పందిస్తుందని EPFO చెబుతోంది.
ఇలా EPFO సేవలకు హాజరు కావాలంటే ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీ ఫోన్ నుంచే UAN పొందండి, యాక్టివేట్ చేయండి, సేవలు వాడుకోండి. టెక్నాలజీ ద్వారా ఉద్యోగుల భవిష్య భద్రత మరింత స్మార్ట్ చేసుకోండి.