Russia: అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్లీ అమెరికా డాలర్ల వైపు మొగ్గు చూపుతోందని వస్తున్న వార్తలు ప్రపంచ పసిడి మార్కెట్‌ను కలవరపరుస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం..
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్లీ అమెరికా డాలర్ల వైపు మొగ్గు చూపుతోందనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్లలో తీవ్ర అలజడిని సృష్టిస్తోంది.
25
అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం..
అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం నెలకొల్పుకునేందుకు క్రెమ్లిన్ ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేసిందని బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డాలర్‌కు దూరంగా ఉన్న రష్యా ఇప్పుడు మళ్లీ డాలర్ల సెటిల్‌మెంట్‌కు సిద్ధపడటం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.
35
పెట్టుబడిదారుల్లో ఆందోళన
ఈ పరిణామం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించడంతో బంగారంలో పెట్టుబడులు పెట్టినవారు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో రూ. 1,80,779కి చేరిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర, తాజా పరిణామాల నేపథ్యంలో రూ. 1,52,200కు పడిపోయింది.
రష్యా గనుక అధికారికంగా డాలర్ల వాడకాన్ని పునరుద్ధరిస్తే బంగారం విలువ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపుగా రూ. లక్ష దిగువకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సంచలన వార్తలపై రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
55
డాలర్ల చెల్లింపులపై..
డాలర్ల చెల్లింపులపై తమ సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి చర్చలూ జరపడంలేదని రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్ కథనం, రష్యా అధికారిక ప్రకటనల మధ్య స్పష్టత లేనప్పటికీ, మార్కెట్ మాత్రం తీవ్ర అస్థిరతకు గురవుతోంది.