gold rates: మూడు రోజు కూడా తగ్గిన బంగారం ధరలు: తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గాయి

Published : May 14, 2025, 01:10 PM IST

gold rates: గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు గోల్డ్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
15
gold rates: మూడు రోజు కూడా తగ్గిన బంగారం ధరలు: తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గాయి

బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పడిపోయాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. మే 14న 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,060కి, 22 క్యారెట్ల ధర రూ.88,050కి చేరింది. గత మూడు రోజుల్లో బంగారం ధరలు రూ.3,000 కంటే ఎక్కువగా తగ్గాయి.

25

ధరల తగ్గుదలకు ఇవే కారణాలు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ తగ్గింది. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి సూచనలు కనిపించడంతో బంగారం ధరలు తగ్గాయి. భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్లలో స్థిరత ఏర్పడింది. అమెరికా డాలర్ బలపడటంతో బంగారం ధరలు తగ్గాయి. ఇన్వెస్టర్లు కూడా లాభాల కోసం మొగ్గు చూపడంతో బంగారం ధరలు తగ్గాయి.

35

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (మే 14, 2025) ఇలా ఉన్నాయి

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,819గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,899గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,827గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,907గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 88,825గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 96,905గా ఉంది.

 

45

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.88,050, 24 క్యారెట్ల ధర రూ.96,060గా ఉంది. చెన్నైలో రూ.88,050, రూ.96,060, ఢిల్లీలో రూ.88,710, రూ.96,760, కోల్‌కతాలో రూ.88,050, రూ.96,060, బెంగళూరులో రూ.88,050 రూ.96,060గా నమోదైంది. 

55

వెండి ధర ఎలా ఉందంటే..

మే 14న వెండి ధర రూ.97,900 (ప్రతి కిలోగ్రామ్) వద్ద స్థిరంగా ఉంది.

ప్రస్తుత ధరలో తగ్గుదల వల్ల బంగారం కనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అయితే బంగారం ధరలు మారుతున్న నేపథ్యంలో కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలను పరిశీలించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories