రాయల్ ఎన్‌ఫీల్డ్ లో వివిధ రకాల మోడల్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా క్లాసిక్ 350, హిమాలయన్, మీటియోర్ 350, కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650 తదితర మోడల్స్ అందుబాటులో మాార్కెట్ లో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ భారతదేశంలో ప్రధానంగా ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆసియా దేశాల్లో బ్రాంచులు ఉన్నాయి.
2023 బుల్లెట్ 350 క్లాసిక్ మోడల్ ప్రస్తుతం లేటెస్ట్ గా మార్కెట్ లో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. దీంతో పాటు స్క్రామ్ 411, సూపర్ మెటియోర్ 650 మరికొన్ని రకాలు ప్రత్యేక మోడల్స్ గా తయారయ్యాయి. ఏ మోడల్ కు ఆ మోడల్ ప్రత్యేకతలు ఉండటంతో వాటి ధరలకు అనుగుణంగా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
ఈ బ్రాండ్ తన బలమైన నిర్మాణం మరియు ప్రత్యేకమైన ఎంజిన్ శబ్దం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రైడింగ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనదిగా మారింది.