బైక్ పై వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే తలకు తీవ్రగాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద సమయంలో తలకు రక్షణ కల్పిస్తుంది. సీరియస్ గాయాలు కాకుండా హెల్మెట్ కాపాడుతుంది. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ చట్టాన్ని పాటించడం ద్వారా జరిమానాలు, చట్టపరమైన సమస్యలు రాకుండా తప్పించుకోవచ్చు. అంతేకాకుండా వర్షం, దుమ్ము, ధూళి వంటి బయటి పరిసరాల నుండి కళ్లకు, ముఖానికి రక్షణగా హెల్మెట్ పనిచేస్తుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు హెల్మెట్ సహాయపడుతుంది.