Renault kwid: నెల‌కు రూ. 5వేల ఈఎమ్ఐతో కొత్త కారు.. డౌన్‌పేమెంట్ ఎంత క‌ట్టాలంటే.

Published : Sep 29, 2025, 10:40 AM IST

Renault kwid: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ సంస్క‌ర‌ణ‌ల‌తో ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గిన విష‌యం తెలిసిందే. వీటిలో త‌క్కువ బ‌డ్జెట్ కార్లు కూడా ఉన్నాయి. తాజా నిర్ణ‌యంతో రెనాల్ట్ క్విడ్ ధ‌ర భారీగా త‌గ్గింది. 

PREV
15
కొత్త జీఎస్‌టీ ధరలు

2025 సెప్టెంబర్ 22 నుంచి రెనాల్ట్ క్విడ్‌కు కొత్త జీఎస్‌టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ త‌గ్గింపుతో పాత‌ ధరలతో పోలిస్తే రూ.40 వేల నుంచి రూ.55 వేల వరకు తగ్గింపులు వచ్చాయి. ఏయే మోడ‌ల్‌పై ఎంత త‌గ్గిందంటే.

* RXE మాన్యువల్ వేరియంట్: పాత ధర రూ. 4,69,995 కాగా కొత్త ధర రూ. 4,29,900 (తగ్గింపు ₹40,095)

* RXL(O) మాన్యువల్: రూ. 5,09,995 కాగా కొత్త ధ‌ర రూ. 4,66,500 (తగ్గింపు ₹43,495)

* RXT మాన్యువల్: రూ. 5,54,995 కాగా కొత్త ధ‌ర రూ. 4,99,900 (తగ్గింపు ₹55,095)

* Climber మాన్యువల్: పాత ధ‌ర‌ రూ. 5,87,995 కాగా కొత్త ధ‌ర రూ. 5,37,900 (తగ్గింపు ₹50,095)

* Climber DT మాన్యువల్ పాత ధ‌ర రూ. 5,99,995 కాగా కొత్త ధ‌ర రూ. 5,48,800 (తగ్గింపు ₹51,195)

* ఆటో (AMT) వేరియంట్లలో కూడా రూ. 51 వేల నుంచి రూ. 55 వేల వరకు త‌గ్గింది. అత్యధిక తగ్గింపు Climber DT AMT వేరియంట్‌కి ల‌భిస్తోంది.

25
భారీగా త‌గ్గిన‌ ప్రారంభ ధర

జీఎస్‌టీ తగ్గింపుతో క్విడ్ ప్రారంభ ధర ఇప్పుడు కేవలం రూ. 4.30 లక్షల నుంచి మొదలవుతోంది. శాతం పరంగా చూస్తే గరిష్టంగా 9.93% వరకు చౌకగా లభిస్తోంది. ఇంత తక్కువ ధరకే 1.0L పెట్రోల్ వేరియంట్లు అందుబాటులో ఉండటం వల్ల క్విడ్ మరింత ఆకర్షణీయంగా మారింది.

35
మైలేజ్, ఫీచర్లు

రెనాల్ట్ కంపెనీ ప్రకారం క్విడ్ లీటరుకు సుమారు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అందువల్ల సిటీ డ్రైవింగ్, చిన్న కుటుంబాల కోసం ఇది సరైన ఎంపిక‌గా చెప్పొచ్చు. తగ్గిన ధరలతో పాటు మైలేజ్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల కస్టమర్లలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

45
రూ. 5 వేలు చెల్లిస్తే చాలు

కంపెనీ వెబ్‌సైట్‌లో లభించే లోన్ ఆప్షన్ ప్రకారం బేస్ వేరియంట్ ధర: ₹4.29 లక్షలుగా ఉంది. ఈ కారును రూ. 1.30 ల‌క్షల డౌన్‌పేమెంట్‌తో సొంతం చేసుకోవ‌చ్చు. లోన్ మొత్తం రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 7 ఏళ్ల టెన్యూర్‌తో లోన్ తీసుకుంటే నెల‌కు రూ. 5 వేలు ఈఎమ్ఐ చెల్లిస్తే స‌రిపోతుంది.

55
అద‌న‌పు ఖ‌ర్చులు కూడా..

బేసిక్ ధరతో పాటు ఆన్‌రోడ్ ఛార్జీలు, యాక్ససిరీస్, ఇన్సూరెన్స్, EMI ప్రొటెక్షన్, జాబ్ లాస్ కవర్ వంటి అదనపు అంశాలను కూడా కస్టమర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మొత్తం ఈఎంఐ కొంత పెరగవచ్చు. అందువల్ల కారు కొనుగోలు ముందు డీలర్ వద్ద ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories