ప్రస్తుతం కాలంలో క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎందుకంటే ఏ లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ముందుగా చూసేది సిబిల్ స్కోర్ నే. ఇది వ్యక్తుల ఫైనాన్షియల్ స్టెబిలిటీని తెలియజేస్తాయి.
హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఎలాంటి లోన్ పొందాలన్నా సిబిల్ స్కోర్ చాలా అవసరం. అవసరం మాత్రమే కాదు సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్ దక్కుతుంది. అందుకే ఏదైనా ఋణానికి దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే దాన్ని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. 30 రోజుల్లో మీ స్కోర్‌ను మెరుగు పరచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.