కారు బ్రేక్ ఫెయిల్ అయినా.. ఇలా చేస్తే యాక్సిడెంట్ కాదు: అందరూ సేఫ్

First Published | Oct 18, 2024, 6:57 PM IST

ఓ కారు హైవేపై సుమారు 100 కి.మీ. వేగంతో వెళుతోంది. కారులో అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ముందున్న కారు స్లో అయ్యింది. దీంతో డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడానికి ప్రయత్నించారు. కాని బ్రేక్ పడటం లేదు. పదే పదే బ్రేక్ ఫెడల్ తొక్కినా పనిచేయలేదు. డ్రైవర్ కి పరిస్థితి అర్థమైపోయింది. బ్రేక్ ఫెయిల్ అన్న విషయాన్ని కారులో ఉన్న వారికి మెల్లగా చెప్పాడు. వారు ఏడుపులు, అరుపులు మొదలు పెట్టారు. కాని డ్రైవర్ తెలివితేటలు ఉపయోగించి యాక్సిడెంట్ కాకుండా కారును జాగ్రత్తగా ఆపారు. ఇదేలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 
 

ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కనురెప్ప వేసేలోపే యాక్సిడెంట్స్ జరిగిపోతాయి. మన తప్పు లేకుండా జరిగే ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కష్టమే. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకొనే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. అలాంటి సందర్భమే కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం. కారులో వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అవ్వడం అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో పానిక్ కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
 

1. శాంతంగా ఉండండి
బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు మొట్టమొదట కారులో ఉన్న వారు పానిక్ కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. డ్రైవింగ్ చేసే వారిని కంగారు పెట్టకూడదు. దీంతో వారు యాక్సిడెంట్ కాకుండా సరైన నిర్ణయం తీసుకోవడమే అవకాశం ఉంటుంది. 

2. ఎమర్జెన్సీ లైట్ వాడండి
వెంటనే హజార్డ్ లైట్లను ఆన్ చేయాలి. తద్వారా ఇతర డ్రైవర్లకు మీ కారు అదుపులో లేదని అర్థమవుతుంది. దీంతో వారు మీ కారుకు దూరంగా ఉంటారు. దీని వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుంది. 
 


3. ఇంజిన్ బ్రేకింగ్ వాడటం
బ్రేక్ ఫెయిల్ అయిన కారు వేగం తగ్గించడానికి ముందుగా మీరు ఇంజిన్ బ్రేకింగ్ పద్ధతి వాడొచ్చు. అంటే కారు వేగం తగ్గించడానికి 5వ గేర్ లో ఉన్న కారును క్లచ్ తొక్కి నెమ్మదిగా 4వ గేర్ లోకి, తర్వాత 3వ గేరు, 2వ గేరు చివరగా మొదటి గేరులోకి తీసుకురావాలి. 

అంత సమయం లేనప్పుడు టాప్ గేర్ లో ఉన్న కారు వేగం తగ్గించడానికి క్లచ్ తొక్కి 2 వ గేరు కాని, 1 గేర్ కాని వేసి క్లచ్ వదిలేయాలి. దీంతో కారు ఇంజిన్ గుద్దుకొని ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో కారులో ఉన్న వారు కాస్త కుదుపుకు గురవుతారు తప్ప ప్రమాదం జరగదు. 

4. హ్యాండ్ బ్రేక్ వాడండి 
హ్యాండ్ బ్రేక్‌ను మెల్లగా ఉపయోగించడం ద్వారా కారు వేగాన్ని తగ్గించవచ్చు. కానీ ఇది చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే సడన్‌గా హ్యాండ్ బ్రేక్‌ను నొక్కడం వలన కారు మెలికలు తిరగే ప్రమాదం ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ వేసి, తీసి, ఇలా పదే పదే  చేయడం ద్వారా కారు వేగాన్ని తగ్గించవచ్చు. 

అంత సమయంలేకపోతే హ్యాండ్ బ్రేక్ ఒక్కసారిగా వేసినా భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 

5. రోడ్డు అంచులోకి దించేయండి
రోడ్డు దారిలో ఉన్న కంచె, గడ్డి ప్రాంతం లేదా చిన్న అడ్డు లాంటి ప్రదేశాలను గుర్తించి, కారు వేగం తగ్గేలా ప్రయత్నం చేయండి. సాఫ్ట్ ప్రదేశాల్లో కారు ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

6. క్లచ్ వాడటం ఆపేయండి
బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువగా క్లచ్ ఉపయోగించడం మంచిది కాదు. దీని వల్ల కారులో ఫ్రీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. క్లచ్ వదిలేయడం వల్ల కారు వేగం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంజిన్ బ్రేకింగ్ విధానం ఉపయోగించినప్పుడు గేర్ మార్చి క్లచ్ ఒక్కసారిగా వదిలేయండి. 

బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అవడం వల్ల ఎక్కువగా కారు బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. అందువల్ల కారును మెకానిక్‌కు చూపించి, ప్రతిసారి బ్రేక్ ఆయిల్స్ చెక్ చేయించుకోండి. 

Latest Videos

click me!