గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్: ఇంత ధర మీరు చూసుండరు

First Published | Oct 18, 2024, 7:59 PM IST

బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఎన్నడూ నమోదవని రేటు అక్టోబర్ 18 శుక్రవారం నమోదైంది.  పూర్తి వివరాలకు ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 

దేశం మొత్తం పండగ మూడ్ లోకి వచ్చేసింది. సుమారు రెండు నెలలుగా గణపతి నవరాత్రులు, దసరా ఉత్సవాలతో జనం ఉత్సాహంగా గడిపారు. ఇప్పుడు దీపావళిని ధూంధాం గా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. పండగల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక ఆఫర్లతో అనేక కంపెనీలు సందడి చేశాయి. టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, సెల్ ఫోన్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా తక్కువ ధరకు లభించాయి. వీటితో పాటు కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ స్కూటర్లు కూడా బారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు ఆకర్షించాయి. దీపావళి దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రజలను బంగారం ఆకర్షిస్తోంది. 
 

దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తారు. అందువల్ల అందరూ బంగారం కొని లక్ష్మీ అమ్మవారికి అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. దీంతో ప్రజల నుంచి బంగారం కొనేందుకు బాగా డిమాండ్ పెరగడంతో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదవ్వని ధర ప్రస్తుతం రికార్డు అయ్యింది. 
 

Latest Videos


దీపావళి సందర్భంగా బంగారు నగలు అలంకరించుకోవడానికి ప్రజలు చాలా ఉత్సాహం చూపుతున్నారు. దేశవ్యాప్తంగా నగల తయారీకి వచ్చిన ఆర్డర్లే బంగారానికి ఉన్న డిమాండ్ ను తెలియజేస్తున్నాయి. అందువల్లనే గోల్డ్ రేటు రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ హై రేటు రూ.80 వేలు నమోదైంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 18న 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.870 పెరిగి, రూ.78,980కి చేరుకుంది. నగల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల ధర సుమారు రూ.800 పెరిగింది. ఇది 10 గ్రాముల ధర రూ.72,400కు చేరుకుంది. వివిధ రకాల టాక్సులు కలిపి దేశంలోని ముంబై, డిల్లీ, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో రూ.80 వేలకు చేరుకుంది. 

వెండి  కూడా ధర పెరిగింది. కిలోకు సుమారు రూ.1000 పెరిగింది. అంటే ప్రస్తుతం ధర రూ.1,05,000 ఉంది. 
 

బంగారం ధర పెరుగుదలకు కారణాలు..
గత మూడు రోజులుగా బంగారం ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్లనే గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట ధరలను చేరుతున్నాయి. 
దీంతో పాటు సెంట్రల్ బ్యాంకులు కూడా తమ కొనుగోళ్లను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. ఇది కూడా గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణం. ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోవడంతో దీపావళి కోసం నగలు కొనుక్కోవాలనుకున్న వారు నిరాశ చెందుతున్నారు. గ్రాము ధర దాదాపు రూ.8000కి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 

దేశంలోని పలు ముఖ్య నగరాల్లోని బంగారం రిటైల్ ధరలు ఇలా... 

24 క్యారెట్ల రేట్లు గ్రాముకు చెన్నై,ముంబై, కలకత్తా, బెంగళూరులో రూ.7898 ధర ఉంది.  దిల్లీలో రూ.7913, వడోదర, అహ్మదాబాదులో రూ.7903, జైపూరులో రూ.7913, మంగళూరులో రూ.7898, నాశిక్‌లో రూ.7901, గురుగ్రామ్, నోయిడాలో రూ.7913 వద్ద ధరలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, విశాఖలో 22 క్యారెట్ల ధర రూ.7240, 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లోనూ ధర రూ.7898 ఉంది. వెండి ధర కూడా కేజీకి రూ.2000 పెరిగింది. ప్రస్తుతం రూ.1,05,000 వద్ద ఉంది.

click me!