ఇలాంటి సమయంలో మీరు ఏదైనా బ్యాంక్ పని పూర్తి చేయాల్సి ఉంటే ముందుగా మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు తెరిచి ఉంటాయో తెలుసుకోండి. ఎందుకంటే మరి కొద్దిరోజుల్లో మే నెల ప్రారంభం కానుంది. అయితే ఈ నెలలో సుమారు 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్త వహించాలి లేకపోతే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పరిమిత సమయం వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరు మే క్యాలెండర్‌ను పరిశీలిస్తే మొత్తం 12 రోజులు పాటు బ్యాంకులు మూసివేయనున్నారు.
మే 1 మేడే అంటే కార్మిక దినోత్సవం ఈ కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గువహతి, హైదరాబాద్, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురం బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే మే 2న ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది.
మే 7న జమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు తెరవవు. అలాగే ఈ నెల రెండవ, నాల్గవ శనివారాలు మే8 ఇంకా 22 తేదీలలో రానున్నాయి. ఈ రెండు రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. అలాగే మే2, మే9, మే 16, మే23, మే30 తేదీలలో ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది.
మే 13న బేలాపూర్, జమ్మూ, కొచ్చి, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్, తిరువనంతపురాలలో ఈద్-ఉల్-ఫితర్ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. మే 14న అగర్తాలా, అహ్మదాబాద్, ఐజాల్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, డెహ్రాడూన్, గాంగ్టక్, గువహతి, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, న్యూ ఢీల్లీ, పనాజీ , రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలోని బ్యాంకులు మూసివేయబడతాయి. మే14 పర్షురామ్ జయంతి, ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి, అక్షయ తృతీయ. కొన్ని రాష్ట్రాల్లో ఈద్ సెలవుదినం మే13న, మరికొన్ని రాష్ట్రాల్లో మే14న ఉండటం గమనించదగిన విషయం.
మే 26న అగర్తాలా, బేలాపూర్, భోపాల్, చండీఘడ్, డెహ్రాడూన్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢీల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఎందుకంటే మే 26న బుద్ధ పూర్ణిమ.ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకుల అత్యున్నత సంస్థ ఇప్పటికే కరోనా దృష్టిలో ఉంచుకొని ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు తెరవలని సూచించాయి.