కళ్లు చెదిరే బంపర్ ఆఫర్లు.. రిలయన్స్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్ షురూ

Published : Oct 01, 2025, 08:58 PM IST

Reliance Digital sale: భారీ ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభం అయింది. అక్టోబర్ 25 వరకు ఈ పడగ సేల్ ఉండనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, అప్లయన్సులపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.

PREV
15
పండుగ సీజన్ ఆరంభం.. రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లు

భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభం అవ్వడంతో రిలయన్స్ డిజిటల్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్టోబర్ 25 వరకు కొనసాగుతుంది. “Celebrate Big, Save Bigger” అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ సేల్‌లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయన్సులు, వేర్‌బుల్స్ వరకు అన్నింటిపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

25
Reliance Digital sale మెగా ఆఫర్లు ఇవే

రిలయన్స్ డిజిటల్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సేల్‌లో లో భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్న కొన్ని అద్భుతమైన డీల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

• టీవీలు: తోషిబా 65” QLED కేవలం ₹45,990కే అందుబాటులో ఉంది. 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు క్యాష్‌బ్యాక్ తర్వాత ₹27,499కే లభిస్తున్నాయి.

• స్మార్ట్‌ఫోన్లు: iPhone 16e ₹44,990 నుంచి లభిస్తుంది. iPhone 14పై ₹5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ₹4,000 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. మోటరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్లు కూడా ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉన్నాయి. చాలా తగ్గింపు లభిస్తోంది.

• స్మార్ట్ వాచ్‌లు: Apple Watch Series 10 ₹44,400 నుంచి ప్రారంభ ధరగా ఉంది. అలాగే, Series 9 ₹39,900 నుంచి లభిస్తుంది.

• అప్లయన్సులు: 1T 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు ₹17,990 నుంచి ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. డబుల్ డోర్ ఫ్రిజ్‌లు ₹18,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఫ్రిజ్ కొనుగోలుపై ₹8,990 వరకూ ఫ్రీ గిఫ్టులు కూడా ఉన్నాయి.

• వాషింగ్ మెషీన్లు: సెమీ ఆటోమేటిక్ ధరకే టాప్ లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ₹10,990 నుంచి అందుబాటులో ఉంది.

35
రిలయన్స్ డిజిటల్ సేల్: బ్యాంక్ కార్డ్స్, ఫైనాన్స్ ప్రయోజనాలు

రిలయన్స్ డిజిటల్ సేల్ లో బ్యాంక్ కార్డ్స్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అలాగే, ఫైనాన్స్ ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కస్టమర్లు బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు ₹15,000 వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. పేపర్ ఫైనాన్స్ ద్వారా ₹30,000 వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అదనంగా, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ప్రధాన బ్యాంకుల ద్వారా లభిస్తోంది.

45
రిలయన్స్ డిజిటల్ సేల్: షాపింగ్ ఛానెల్స్ లోనూ భారీ ఆఫర్లు

ఈ సేల్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మై జియో స్టోర్స్, జియోమార్ట్ డిజిటల్ స్టోర్స్, ఆన్‌లైన్ reliancedigital.in లో అందుబాటులో ఉంది. సేమ్-డే డెలివరీ, ఈజీ రిటర్న్/ఎక్స్చేంజ్ పాలసీలు, ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

55
అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల పై భారీ ఆఫర్లు

రిలయన్స్ డిజిటల్ ఈ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ఐఫోన్‌లు, మోటరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. హోమ్ అప్లయన్సులపై 40% వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కిచెన్ అప్లయన్సులపై 1 ఐటెమ్ కొంటే 5%, 2 ఐటెమ్స్ కొంటే 10%, 3 లేదా ఎక్కువ ఐటెమ్స్ కొంటే 15% వరకు ఆఫర్ ఉంది.

రిలయన్స్ డిజిటల్ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్ వినియోగదారుల మంచి అవకాశం అని చెప్పవచ్చు. పండుగ సమయంలో టెక్నాలజీ ఉత్పత్తులను తక్కువ ధరలకు, బంపర్ ఆఫర్లతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం. అక్టోబర్ 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories