అమెరికాలో అవసరమైన స్థాయిలో ఐటీ నిపుణులు లేరు. అందుకే విదేశీయులను తమ దేశానికి రప్పించుకొని పని చేయించుకుంటున్నారు. అయితే వీసా (US Visa)లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ విదేశీయులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H1b వీసాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి విదేశీ నిపుణులకు అమెరికా వెళ్లేందుకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అమెరికాలో పని చేయాలంటే ఉద్యోగులను ఇతర దేశాల నుంచి తెస్తున్న కంపెనీలు ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలన్న కల ఎంతో మందికి కరిగిపోతూ వస్తోంది. ఇక అమెరికన్ కంపెనీలకు కూడా సరైన నిపుణులు దొరక్క ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే వారు ఇప్పుడు ట్రంప్ కి అబ్బా అనిపించేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. అన్ని కంపెనీలు కలిసి భారతీయులకు వీసా ఇచ్చి ఇక్కడకు తీసుకొచ్చే బదులు తామే భారత్ వెళ్లి పని చేయించుకుందామని నిర్ణయం తీసుకోబోతున్నాయి.
24
ట్రంప్‌కు అబ్బా అనిపించేలా
H1b వీసా ఫీజు మొన్నటి వరకు 2000 డాలర్ల నుంచి 5000 డాలర్ల వరకు ఉండేది. దానిని ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశాడు ట్రంప్. దీంతో విదేశీయులను అమెరికా తీసుకొచ్చి పనిచేయించుకోవడం కంపెనీలకు పెనుభారంగా మారిపోతుంది. దానివల్ల వారు అమెరికాలో స్థానికంగా ఉన్న వారిని ఎంపిక చేసుకుంటారు. అలా అమెరికాలో ఉద్యోగాలను పెంచుకోవడం అనేది ట్రంప్ ఆలోచన. అయితే అమెరికా కంపెనీలకు మాత్రం సరైన టెక్నిక్ ను దొరక్క ఇబ్బంది పడుతూ నష్టాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వీరు తెలివిగా ఆలోచించారు.
34
భారత్ వచ్చేస్తాయి
అమెరికాలోని ఆర్థిక సేవలను అందించే కంపెనీలు టెక్ రంగంలో ఉన్న కంపెనీలు ఎక్కువగా భారతదేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల పై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. వీసా ఫీజు నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకోకపోతే అమెరికాకు చెందిన ఏఐ సంస్థలు, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సంస్థలు, ఎనలిటిక్స్ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ వంటివన్నీ కూడా భారతదేశానికి తరలిరావాలని భావిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ బదులుగా ఇలా దేశానికే వచ్చి పని చేయించుకోవడం ఉత్తమమని కంపెనీలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇలా జరిగితే ట్రంప్ కు టెక్ కంపెనీలన్నీ కలిపి గట్టి దెబ్బే కొట్టినట్టు. దాని నుంచి తేరుకోవడం ట్రంప్ కు కష్టమే.
కరోనాక ముందు వర్క్ ఫ్రం హోమ్ అనే పద్ధతి లేదు. కానీ కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం అనేది విస్తరించింది. కాబట్టి కరోనా సమయంలో ఎలా అయితే పనులన్నీ జరిగాయో.. అలాగే టెక్ కంపెనీలు తమ ప్రాజెక్టులను రన్ చేసుకోవచ్చు. ఇందుకోసం అమెరికా నుంచి భారత్, కెనడా, మెక్సికోలకు కీలకమైన సంస్థలు తరలించే అవకాశం ఉంది. ఇలా జరిగితే అమెరికాకు అతి పెద్ద దెబ్బ కొడుతుంది. భారత్లో అనేక సంస్థలు గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. అలా ఏర్పాటు చేసిన వాటిలో సేల్స్ ఫోర్స్, వాల్ మార్ట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్ మ్యాన్ శాక్స్, ఐబీఎం, ఇంటెల్.. ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి. అవి నేరుగా భారత్ కు వచ్చి తమ సెంటర్లలోనే పనిచేయించుకోవచ్చు.