మొబైల్ యూజర్లకు జలక్.. రూ. 189 ప్లాన్‌ను తొల‌గించిన ప్ర‌ముఖ‌ టెలికం సంస్థ‌

Published : Nov 11, 2025, 04:16 PM IST

Recharge plan: ప్ర‌ముఖ టెలికం సంస్థ యూజ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవ‌ల్ రీఛార్జ్ ప్లాన్ అయిన రూ. 189ని తొల‌గిస్తూ షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో యూజ‌ర్లకు దెబ్బ‌ప‌డిన‌ట్లైంది. ఇంత‌కీ ఏంటా టెలికం సంస్థ‌? ఏ ప్లాన్‌ను నిలిపివేసింది.  

PREV
15
ఎయిర్‌టెల్ కీల‌క నిర్ణ‌యం.

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల జాబితాలో కీలక మార్పు చేసింది. గత జూలైలో ప్రవేశపెట్టిన రూ.189 ఎంట్రీ-లెవెల్‌ ప్లాన్‌ను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆ ప్లాన్‌ కనిపించడం లేదు. దీంతో ఇకపై వినియోగదారులు కనీస రీఛార్జ్‌గా రూ.199 ప్లాన్‌ ఎంచుకోవాల్సి వస్తుంది.

25
వాయిస్ కాల్స్ కోరుకునే వారికి పెద్ద దెబ్బ

రూ.189 ప్లాన్‌ ప్రధానంగా కాలింగ్‌ కోసం మాత్రమే ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌లో 21 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 1జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు అందుబాటులో ఉండేవి. సీనియర్‌ సిటిజన్లు, డేటా అవసరం తక్కువగా ఉన్న యూజర్లకు ఇది అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్‌ తొలగింపుతో, కాలింగ్‌ మాత్రమే అవసరమయ్యే వినియోగదారులు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

35
రూ.199 కొత్త ఎంట్రీ ప్లాన్‌ వివరాలు

ఎయిర్‌టెల్‌ తాజా ఎంట్రీ ప్లాన్‌ రూ.199తో అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ డేటాను పొందుతారు. అదనంగా హలో ట్యూన్స్‌, ‘పెర్ప్లెక్సిటీ ప్రో AI’ టూల్‌కు ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. అంటే డేటా, ఎంటర్‌టైన్‌మెంట్‌, AI టూల్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా కంపెనీ తన కొత్త ప్లాన్‌లను రూపొందించింది.

45
డేటా ఆధారిత మార్కెట్ వైపు అడుగులు

వాయిస్-ఓన్లీ ప్లాన్‌ల కంటే డేటా-కేంద్రిత ప్లాన్‌లకే భవిష్యత్తు ఉందని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ ఈ నిర్ణయం కూడా అదే దిశలో ముందడుగు. నిపుణుల ప్రకారం, యూజర్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ సేవలు, సోషల్‌ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌ వంటివి వినియోగిస్తున్నందున, కంపెనీలు తక్కువ డేటా ప్లాన్‌లను క్రమంగా తొలగిస్తున్నాయి. ఇది వినియోగదారులను అధిక డేటా ప్లాన్‌ల వైపు మళ్లించే వ్యూహంగా కనిపిస్తోంది.

55
వినియోగదారులపై ప్రభావం

రూ.189 ప్లాన్‌ నిలిపివేయడం చిన్న మార్పుగా కనిపించినా, పెద్ద మొత్తంలో వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సెకండరీ సిమ్‌లు కలిగి, కాలింగ్‌ కోసం మాత్రమే వాటిని ఉపయోగించే వారు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు, కంపెనీ 5జీ ఉచిత డేటా ఆఫర్లను కూడా పరిమితం చేసే ప్రయత్నంలో ఉంది. అంటే, రాబోయే రోజుల్లో మొబైల్‌ డేటా మ‌రింత భారం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories