Gift for Employees: ఉద్యోగులను ప్రోత్సహించే మార్గాల కోసం కంపెనీలు వెతుకుతూ ఉంటాయి. అలాగే ఓ కంపెనీ కొత్తగా ఆలోచించింది. ఉద్యోగులకు బంగారు కీబోర్డ్ లను అందించింది.
చైనాలోని ఒక టెక్నాలజీ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. చైనాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఇన్‌స్టా360 తన ప్రతిభావంతమైన ఉద్యోగులను మోటివేట్ చేసేందుకు బహుమతిగా ఖరీదైన బంగారు కీబోర్డ్ కీలను అందించింది. ఈ బహుమతి చూసి ఆ కంపెనీ ఉద్యోగులు ఎంతో సంతోషించారు. ఇన్‌స్టా360 కంపెనీ ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ‘ప్రోగ్రామర్ డే’ను నిర్వహించుకుంటుంది. ఈ రోజున కంపెనీ తమ ఉద్యోగులను గౌరవించే ఉద్దేశ్యంతో బంగారంతో చేసిన కీబోర్డ్ కీ క్యాప్స్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇలా గత నాలుగేళ్లుగా అందిస్తోంది. ఈసారి మొత్తం 21 మంది ఉద్యోగులు ఈ ప్రత్యేక బహుమతిని అందుకున్నారు.
25
ఎంత బరువున్న బంగారం?
ఈసారి బంగారు కీ లు ఉన్న కీబోర్డ్ ను బహుమతిగా అందంచారు. అందులో అందులో అత్యంత విలువైనది స్పేస్ బార్ కీ. దాని బరువు 35.02 గ్రాములు. ఇక దీని విలువ సుమారు 38 లక్షల రూపాయలు. మిగతా కీలు 10 నుండి 25 గ్రాముల మధ్య బరువుతో ఉంటాయి. ఇవన్నీ కూడా 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసినవే.
35
బంగారమే బహుమతి ఎందుకు?
ఇన్‌స్టా360 కంపెనీ వ్యవస్థాపకుడు లియూ జింగ్‌కాంగ్ మాట్లాడుతూ ఈ బంగారు కీ క్యాప్స్ కేవలం బహుమతి కాదు...తమ ఉద్యోగుల ప్రతిభకు ప్రతీక అని చెబుతున్నారు. ప్రతి ప్రోగ్రామర్ కీబోర్డ్‌పై చేసే ప్రతి టచ్ విలువైనదే. ఆ విలువను బంగారంలా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది అని ఆయన చెప్పారు. కంపెనీ ఎన్నో సందర్భాల్లో కూడా ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. వివాహం, పిల్లలు పుట్టిన సందర్భాల్లో 1 గ్రాము బంగారు నాణెం, సంవత్సరం చివర్లో అత్యుత్తమంగా పనిచేసినవారికి 50 గ్రాముల బంగారం కూడా అందజేస్తారు.
సాధారణంగా కంపెనీలు నగదు బోనస్‌లు, జీతం పెంచడం, హాలిడే ప్యాకేజీల వంటి రూపంలో బహుమతులను అందిస్తాయి. కానీ బంగారాన్ని బహుమతిగా ఇస్తే మాత్రం మరింత ఆనందాన్ని పొందుతారు. అందుకే బంగారాన్ని ఈ కంపెనీ ఎక్కువ సార్లు బహుమతిగా అందిస్తుంది. ఇన్‌స్టా360 తమ ఉద్యోగులకు వారి శ్రమ బంగారంతో సమానం అనే భావనను అందించేందుకు కూడా ఇలా బంగారాన్ని ఇస్తున్నారు . ఈ రకమైన బహుమతులు ఉద్యోగుల్లో ఆనందం, నిబద్ధత, సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
55
కీబోర్డ్ ఫోటోలు వైరల్
బంగారు కీబోర్డ్ ఫోటోలు ఆ కంపెనీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగానే అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లకు ఈ బహుమతి తెగ నచ్చేసింది. తమ కంపెనీలు కూడా అలా ఇస్తే బావుంటుందని కోరుకుంటున్నారు.ఎంత మంచి బాస్ ఇలాంటి బాస్ మాకు దొరకాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ కావొచ్చు అని భావిస్తున్నారు. మరికొంతమంది ఈ పని ఉద్యోగుల పట్ల గౌరవ సూచకమని కామెంట్లు చేశారు.