ఇంతకీ రెపో రేటు అంటే ఏంటి.?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే తాత్కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే దేశంలోని బ్యాంకులకు ఆర్బీఐ అప్పు ఇవ్వడం అని చెప్పొచ్చు. ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకున్న బ్యాంకులు చెల్లించే వడ్డీ రెపోరేటుపై ఆధారపడి ఉంటుంది.
రెపో రేటు పెరిగితే/తగ్గితే ఏం జరుగుతుంది.?
ఒకవేళ రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఇది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆర్ధిక వ్యాపారం ఊపందుకుంటుంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయని అనుకునే సమయాల్లో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తాయి. రెపోరేటును ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ప్రతి రెండు నెలలకోసారి భేటీ అయ్యి రేటును నిర్ణయిస్తుంది.