swiggy Offers
స్విగ్వీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా అనేక ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాంలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ మార్కెట్లో విపరీతమైన పోటీ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లను ఇచ్చేస్తున్నారు. మరి మార్కెట్లో నిలబడాలంటే తప్పదు కదా. అయితే... గత ఏడాది సెప్టెంబర్‌లో జెప్టో సంస్థ సూపర్ సేవర్ పేరుతో ఆఫర్ తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది. కొత్త వినియోగదారులను కూడా పెంచేసుకుంది. ఈ పోటీని తట్టుకునేందుకు స్విగ్గీ ఏం చేసిందంటే.
swiggy Offers
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం కిరాణా సరుకులు, రోజువారీ నిత్యావసర వస్తువులు, నుంచి ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్యాషన్, మేకప్, గిఫ్ట్ బొమ్మలు ఇలా సుమారు 35,000 ఉత్పత్తులను కస్టమర్లక అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట్లో ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాంగా మార్కెట్లోకి వచ్చిన స్విగ్గీ... వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర ఉత్పత్తులను అమ్మక తప్పని పరిస్థితి ఎదురైంది.
swiggy Offers
స్విగ్గీ సంస్థ దేశంలోని టైర్ 1, 2 నగరాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇటీవల స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను 100 నగరాలకు విస్తరించింది. అంతేకాకుండా డెలివరీ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. టైర్ 1,2 నగరాల్లో కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారులకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ సర్వీస్‌పై వినియోగదారులు కొంత సంతృప్తికరంగా ఉన్నా.. సరైన ఆఫర్స్ లేవని భావించారు. దీంతో మ్యాక్స్ సేవర్ అనే పేరుతో వీరందరికీ ఆ సంస్థ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.
swiggy Offers
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ క్విక్ కామర్స్ విభాగమైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 'మ్యాక్స్‌సేవర్' అనే ఇన్ యాప్ ఫీచర్‌ను ప్రారంభించింది. మ్యాక్స్ సేవర్ ఆఫర్ కింద.. వినియోగదారులకు కొనుగోలు చేసిన వస్తువులు.. అంటే స్విగ్గీ అందుబాటులో ఉంచిన 35 వేల వస్తువులను కొనుగోలు చేసిన వారికి భారీ రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది అన్ని వర్గాల వినియోగదారులకు వర్తిస్తుందని సంస్థ తెలియజేసింది. ఈ ఆఫర్‌తో భారీగా డబ్బు ఆదా అవుతుందని చెబుతోంది.
swiggy Offers
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 'మ్యాక్స్‌సేవర్' ఆఫర్ కింద.. రోజువారీ కొనుగోలు చేసే వస్తువులపై ఏకంగా రూ.500 వరకు రాయితీ ఇస్తున్నట్లు ఇన్‌స్టామార్ట్ సీఈవో అమితేష్ ఝా ప్రకటించారు. వినియోగదారుల ఇకపై తమ నుంచి మరింత ప్రతిఫలం పొందేలా చేయడమే దుకు లక్ష్యంగా పెట్టుకున్న తెలిపారు. కస్టమర్ ఒక నిర్దిష్ట ఆర్డర్ విలువను చేరుకున్న తర్వాత రూ. 500 వరకు ఆదా చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. సుమారు రూ.999 వరకు సరుకులు కొనుగోలు చేసిన వారందరికీ ఆఫర్ వర్తించనుంది. కస్టమర్లు చెక్అవుట్ సమయంలో ఈ ఫీచర్ కనిపిస్తుందని మ్యాక్స్ సేవను ఎంచుకుంటే డిస్కౌంట్ వచ్చేస్తుంది. అయితే.. ఈ ఆఫర్ స్విగ్గీ ప్రీమియం సభ్యత్వం ఉన్నవారికి, ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఈవో తెలిపారు. బల్క్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక స్విగ్గీతోపాటు అమెజాన్ సంస్థ అమెజాన్ నౌ అని బెంగుళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రాయితీతో వస్తువులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కూడా నూతనంగా 500 స్టోర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.