Gold Price: రోజురోజుకీ పతనమవుతోన్న బంగారం ధర.. నిజంగానే తులం రూ. 50 వేలు కానుందా.?

Published : Apr 09, 2025, 10:59 AM IST

Gold And Silver Price: చుక్కలు చూపించిన బంగారం ధరలు క్రమంగా నేలకు దిగొస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తులం  రూ. లక్షకు చేరడం ఖాయమని అంతా భావించారు. ఇక బంగారం కొనడం కలే అనుకున్నారు. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ పతనం ఇలా పలు రకాల కారణాలతో బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 3450 తగ్గడం విశేషం. మరి బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
18
Gold Price:  రోజురోజుకీ పతనమవుతోన్న బంగారం ధర.. నిజంగానే తులం రూ. 50 వేలు కానుందా.?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, స్టాక్ మార్కెట్ పతనంతో బంగారం ధర తగ్గింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి బంగారం ధరలపై కూడా పడింది. సాధారణంగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

28

గత కొన్ని రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర బాగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో గత ఏడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,450 తగ్గింది. అందుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న రెండు నుంచి మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేలకు పడిపోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

38

దేశంలో ఇవాళ్టి 22 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

1 గ్రాము:  రూ.8,224
8 గ్రాములు: రూ.65,792
10 గ్రాములు: రూ.82,240
100 గ్రాములు: రూ.8,22,400గా ఉంది. 

48

దేశంలో ఇవాళ్టి 24 క్యారెట్ల బంగారం ధర

1 గ్రాము: రూ.8,972
8 గ్రాములు: రూ.71,776 
10 గ్రాములు: రూ.89,720
100 గ్రాములు: రూ.8,97,200. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 90 వేల మార్క్ తగ్గడం విశేషం. 

58

దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది. చెన్నై: రూ.82,240, ముంబై: రూ.82,240, ఢిల్లీ: రూ.82,390, కోల్‌కతా: రూ.82,240, బెంగళూరు: రూ.82,240, హైదరాబాద్: రూ.82,240, పూణే: రూ.82,240 వద్ద కొనసాగుతోంది. 

68
వెండి కూడా బంగారం బాటలోనే

బుధవారం దేశంలో బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. ఇండియాలో వెండి ధర అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, డాలర్‌తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల దేశీయ బంగారం, వెండి ధరలపై ప్రభావం పడుతుంది. 

10 గ్రాములు: రూ.939
100 గ్రాములు: రూ.9,390
1,000 గ్రాములు: రూ.93,900
 

78

స్టాక్ మార్కెట్ పతనమైనా బంగారం ధర తగ్గింది. గత 6 రోజులుగా బంగారం ధర కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ 6న మాత్రమే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇవాళ కూడా బంగారం ధర తగ్గింది. 

88

ఇక బంగారం కొనుగోలు చేసే వారు ఆభరణాలకు బదులు బంగారు బిస్కెట్లు, గోల్డ్ బాండ్లు కొంటే అది ఒక రకమైన పెట్టుబడి లాంటిదే. ఇది ఎప్పటికీ సెకండ్ హ్యాండ్ కాదు. ఆ రోజు బంగారం ధరను బట్టి చాలా సంవత్సరాల తర్వాత కూడా మంచి రేటు పొందవచ్చు. అందుకే బంగారం పెట్టుబడిదారులకు ఇష్టమైన పెట్టుబడి.

Read more Photos on
click me!

Recommended Stories