RBI New Money Transfer Guidelines: ఆర్బీఐ కొత్త డీఎంటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా నేరుగా రూ. 50,000 వరకు పంపేలా కొత్త నిబంధనలు తెచ్చారు. ఆ వివరాలు మీకోసం.
ఆర్బీఐ కొత్త రూల్స్.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మనీ ట్రాన్స్‌ఫర్
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (డీఎంటీ) రూల్స్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తాజా రూల్స్ ప్రకారం, ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేని సామాన్యులు సైతం నేరుగా బ్యాంక్ శాఖకు వచ్చి ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా మరొకరి అకౌంట్‌కు రూ. 50,000 వరకు సులభంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంకింగ్ సౌకర్యాలు లేని మూలలకు కూడా సులభంగా డబ్బులు పంపేందుకు ఈ వెసులుబాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
24
క్యాష్ పే ట్రాన్స్‌ఫర్ లిమిట్స్ రూల్స్
ఈ కొత్త సిస్టమ్‌లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ కొన్ని కఠినమైన పరిమితులు కూడా విధించింది. అలాగే, క్యాష్ పే ట్రాన్స్‌ఫర్ సేవను ఉపయోగించుకునే వారి కోసం ప్రత్యేక లిమిట్స్ ఫిక్స్ చేశారు. దీని ప్రకారం ప్రతి సింగిల్ ట్రాన్సాక్షన్‌లో గరిష్ఠంగా రూ. 10,000 వరకు మాత్రమే పంపడానికి అనుమతి ఉంది. అదేవిధంగా, ఒక్కో లబ్ధిదారుడికి సంబంధించి నెలవారీ ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 25,000 గా నిర్ణయించారు. ఈ నిబంధనల వల్ల అనధికార లావాదేవీలకు చెక్ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది.
34
ఏటీఎం, బిజినెస్ కరెస్పాండెంట్ ద్వారా నగదు విత్‌డ్రా
బ్యాంకులు తమ కస్టమర్ల అకౌంట్ల నుంచి ఎలాంటి బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులకు కూడా డబ్బులు చేరేలా సేవలు అందించడానికి పూర్తి అనుమతి ఉంది. ఇలా పంపిన డబ్బులను అవసరమైన వారు ఏటీఎం ద్వారా లేదా బిజినెస్ కరెస్పాండెంట్ రూపంలో నియమించిన అధికారిక ఏజెంట్ల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇతర ఆమోదిత పేమెంట్ ఛానెల్స్ ద్వారా కూడా ఈ క్యాష్‌ను తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సాధారణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఈ సేవలన్నీ అందించే రెమిటింగ్ బ్యాంకులు, బిజినెస్ కరెస్పాండెంట్లు ఆర్బీఐకి చెందిన నో యువర్ కస్టమర్ రూల్స్ 2025 తప్పకుండా పాటించాలి. క్యాష్ డిపాజిట్ సేవలు పొందే కస్టమర్లు తమ వెరిఫైడ్ మొబైల్ నంబర్, సెల్ఫ్ అటెస్టెడ్ అఫీషియల్లీ వాలిడ్ డాక్యుమెంట్ సమర్పించడం తప్పనిసరి. ప్రతి లావాదేవీని అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయాలి. అంతేకాకుండా, బ్యాంకులు వెలాసిటీ చెక్ వంటి భద్రతా చర్యలను అమలు చేస్తూ, అనుమానాస్పద లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.