PPF ప్రారంభ లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. మీరు ప్రతినెలా కొంత నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఉంటే, 15 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి ఎంత ఫండ్ వస్తుందో చూద్దాం..
ఉదాహరణకు, మీరు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, 15 సంవత్సరాల్లో మీరు డిపాజిట్ చేసే మొత్తం రూ. 1,80,000 అవుతుంది. దానికి 7.1% వడ్డీ రూపంలో రూ. 1,45,217 తోడై మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి దాదాపు రూ. 3.25 లక్షలు అందుతాయి.
అదే ఒకవేళ మీరు నెలవారీ పొదుపును రూ. 5,000కు పెంచితే, మీ 15 ఏళ్ల మొత్తం డిపాజిట్ రూ. 9,00,000 కాగా, వడ్డీ రాబడి రూ. 7,26,085 లభించి చివరకు దాదాపు రూ. 16.27 లక్షల ఫండ్ తయారవుతుంది.
ఇక మరింత మెరుగైన రాబడి కోసం నెలకు రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేస్తే, 15 ఏళ్లలో మీరు చెల్లించే రూ. 18,00,000 అసలుకు వడ్డీ కిందే దాదాపు రూ. 14,52,170 సమకూరి, మొత్తం మీద రూ. 32.55 లక్షల భారీ నిధి మీ సొంతమవుతుంది.