Published : Feb 15, 2025, 11:37 AM ISTUpdated : Feb 15, 2025, 11:40 AM IST
రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా.? ఇప్పటి వరకు అమల్లో విధానాన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తోందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న ఆ నిర్ణయం ఏంటి..? దీంతో ప్రజలకు జరిగే లబ్ధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పేద, మధ్య తరగతి కుటుంబాలకు పోషకాహరం లభించడమే ధ్యేయంగా దేశంలో రేషన్ పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో రకాల ప్రభుత్వ పథకాలకు కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి రేషన్ వ్యవస్థలో త్వరలోనే కొత్త నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
26
కరోనాలో రేషన్ ఆధారం
కరోనా మహమ్మారి సమయంలో దేశంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. రోజు గడవని పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో రేషన్ వ్యవస్థ చాలా మందికి అండగా నిలిచింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించడంతో చాలా మందికి లాభం చేకూరింది. ఇప్పటి వరకు ప్రభుత్వం బియ్యాన్ని ఉచితంగానే అందిస్తోంది.
36
తగ్గుతోన్న రేషన్ తీసుకునే వారి సంఖ్య
ఇదిలా ఉంటే మరోవైపు రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా తగ్గుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు రేషన్ సరుకులపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బియ్యంలాంటివి తీసుకున్నా బయట విక్రయిస్తున్నారు.
46
రేషన్ కి బదులు నగదు
ఈ కారణంగానే రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. ఇకపై రేషన్ కార్డు దారులకు రేషన్ కి బదులుగా నగదు ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి సీరియస్ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
56
నీతి ఆయోగ్ చర్చ
ఇందులో భాగంగానే ఇటీవీ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. రేషన్ పై ఆధారపడిన కుటుంబాలకు సామాగ్రికి బదులు నగదు ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాలపై చర్చించారు. నగదు ఇవ్వడం ద్వారా ప్రజలకు నిజంగానే లాభం ఉంటుందా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు.
66
లాభమా నష్టమా?
అయితే రేషన్ సామానుకు బదులుగా నగదు ఇవ్వడం వల్ల ప్రజలకు నిజంగానే లాభం జరుగుతుందా అన్న ప్రశ్న వస్తోంది. నగదు ఇస్తే ఎంత ఇస్తారు.? ఇది పేదల రేషన్ సామానుకు సరిపోతుందా.? అన్న చర్చ మొదలైంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నగదు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి విధివిదానాలను ప్రకటించనున్నారని సమాచారం.