Credit Card: క్రెడిట్‌ కార్డు వాడకుండా పక్కన పడేస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Published : Feb 14, 2025, 03:33 PM IST

ప్రస్తుతం క్రెడిట్‌ కార్డు వినియోగం భారీగా పెరిగింది. బ్యాంక్‌ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్‌ కార్డు ఇచ్చే రోజులు వచ్చాయి. అయితే మనలో కొందరు రకరకాల క్రెడిట్‌ కార్డులు తీసుకుంటారు. కానీ వాటిని పెద్దగా ఉపయోగించరు. అయితే ఎక్కువ కాలం క్రెడిట్‌ కార్డులను ఉపయోగించకపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?   

PREV
16
Credit Card: క్రెడిట్‌ కార్డు వాడకుండా పక్కన పడేస్తున్నారా.? ఏమవుతుందో తెలుసా..

రోజులో ఒక్కసారైనా క్రెడిట్ కార్డుకు సంబంధించి ఒక ఫోన్‌ కాల్స్‌ వస్తుంది. రకరకాల ఆఫర్లు చెబుతూ క్రెడిట్‌ కార్డులను తీసుకోమని చెబుతుంటారు. దీంతో ఆఫర్లకు అట్రాక్ట్‌ అయ్యి కార్డును తీసుకుంటారు. అయితే ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉండడంతో వాటిని ఉపయోగించే అవసరం ఉండదు. దీంతో పేరుకు క్రెడిట్‌ కార్డు ఉన్నా వాటిని చాలా మంది ఉపయోగించారు. అయితే ఎక్కువగా కాలం క్రెడిట్‌ కార్డులను పక్కన పడేస్తే సమస్యలు తప్పవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కార్డులను వాడకుండా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

26

కార్డ్‌ క్లోజ్‌ చేసే అవకాశం:

క్రిడ్‌ కార్డును ఎక్కువ కాలం ఉపయోగించకపోతే సదరు బ్యాంక్‌ మీ కార్డును డీ యాక్టివేట్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా 6 నెలల నుంచి ఏడాదిలోపు మీ కార్డు నుంచి లావాదేవీ జరగకపోతే కార్డును డీయాక్టివేట్ చేసేందుకు బ్యాంకు ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒకవేళ మీ నుంచి ఎలాంటి సమాధనం రాకపోతే కార్డును డీ యాక్టివేట్‌ చేసేస్తారు. 
 

36

క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం: 

ఎలాగో అవసరం లేదు కదా కార్డ్‌ డీ యాక్టివేట్ చేస్తే ఏమవుతుందిలే అనుకోకండి. ఇలా క్రెడిట్‌ కార్డు డీయాక్టివేట్‌ అయితే మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. అకౌంట్‌ క్లోజ్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుంది. క్రెడిట్‌ కార్డు వినియోగం మీ క్రెడిట్‌ స్కోర్‌లో 30 శాతం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి. 

46

ఈ ప్రయోజనాలు కోల్పోతారు: 

క్రెడిట్‌ కార్డులను ఉపయోగించకపోతే వాటి ద్వారా వచ్చే రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలను కోల్పోతారు. మీ కార్డ్ చాలా కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, మీరు సేకరించిన రివార్డులు, పాయింట్లు, ఆఫర్‌లు వృథా అవుతాయి. 
 

56

ఏమైనా ఛార్జీలు ఉంటాయా.? 

భారతదేశంలో చాలా వరకు క్రెడిట్‌ కార్డ్‌ జారీ సంస్థలు కార్డును ఉపయోగించకపోతే ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. అయితే కనీసం 3 నెలలకు ఒకసారైనా మీ క్రెడిట్‌ కార్డుతో ఏదైనా ట్రాన్సాక్షన్‌ చేయడం మంచిది. మీకు నిజంగానే క్రెడిట్‌ కార్డు అవసరం లేదనుకుంటే. మీ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి డీ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. 
 

66

కార్డు యాక్టివ్‌గా ఉండడానికి ఈ చిట్కాలు పాటించండి.. 

మీకు నిజంగానే కార్డుతో పనిలేకపోతే చిన్న చిన్న లావాదేవీలపైనా నెలల వ్యవధిలో చేయండి. ఉదాహరణకు పెట్రోల్‌, సూపర్ మార్కెట్లో వస్తువులు వంటి నిత్యవసర వస్తువులకు ఉపయోగించండి. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. మీకు క్రెడిట్ కార్డ్ అవసరం లేకపోతే బ్యాంకును సంప్రదించి దాన్ని క్లోజ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు. 
 

click me!

Recommended Stories