ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేదైనా చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అదేవిధంగా, ఒక వ్యక్తి నగదు రూపంలో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా పరిమితి లేదు.అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇవ్వడం లేదా తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి గిఫ్ట్ ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ చేబుతున్నారు.