BSNLలో ఇంత తక్కువకే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్స్ ఉన్నాయా?

First Published | Dec 21, 2024, 7:26 PM IST

జియో, ఎయిర్‌టెల్ ఇస్తున్న పోటీని తట్టుకొని నిలబడటానికి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్‌లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. వినియోగదారులకు అవసరమైన కాల్స్, డేటాను చాలా తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ తో అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఈ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి. 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం ఆపరేటర్. ఎయిర్ టెల్, జియో వంటి ప్రైవేటు కంపెనీల నుంచి అధిక పోటీ ఉన్నప్పటికీ ప్రజలకు తక్కువకే టాప్ అప్ రీఛార్జ్, ప్లాన్స్ అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. పోటీ కంపెనీలు ధరలు పెంచుతుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలు పెంచకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరకే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అమలు చేస్తోంది. అవి రూ.58 ప్లాన్ డేటా వోచర్, రూ.59 ప్లాన్ సాధారణ సర్వీస్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం. 

బీఎస్ఎన్ఎల్ రూ 58 ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ.58 ప్రీపెయిడ్ ప్లాన్ డేటా వోచర్ ప్రయోజనాలను పొందడానికి యూజర్ యాక్టివ్ ప్లాన్ కలిగి ఉండాలి. రూ.58 ప్లాన్ 7 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటాతో వస్తుంది. రోజువారీ డేటా ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ 40 Kbps వేగంతో అందుతుంది. 


బీఎస్ఎన్ఎల్ రూ 59 ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ.59 ప్రీపెయిడ్ ప్లాన్ 7 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తున్నారు. కాని ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేవు. 

తక్కువ డబ్బుతో మంచి సర్వీస్ సేవలు కావాలనుకుంటే ఇవి రెండు మంచి ప్లాన్‌లు. ఈ ప్లాన్‌ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. బీఎస్ఎన్ఎల్ లో ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు ఎన్నో ఉన్నాయి. రూ.108, రూ.107, రూ.198, రూ.201 లాంటి ఆఫర్లు కూడా అవసరానికి సరిపడా డాటాను, కాలింగ్ సదుపాయాన్ని అందిస్తాయి. 

Latest Videos

click me!