ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ ఏటీఎమ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎమ్ లను ఉపయోగించే వారికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఈ ఛార్జీలు ఆయా బ్యాంకులను మారుతూ ఉంటుంది. కాగా ఏటీఎమ్ ఉపయోగించే వారికి ఆర్బీఐ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఏంటా నిబంధనలు.? దీనివల్ల యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏటీఎమ్ ఉపయోగిస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాడ్ న్యూస్. దేశంలో డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చే విధంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎమ్ లావాదేవీలపై తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
29
ఏటీఎమ్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు చెల్లాంచాలనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎమ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసే వారి నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే తాజాగా ఏటీఎమ్ ఇంటర్ఛేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది.
39
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటీఎమ్ నెట్ వర్క్స్ తక్కువగా ఉన్న చిన్న బ్యాంకులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
49
ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎమ్ ల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సహజంగానే ఈ అదనపు ఛార్జీలను బ్యాంకులు కస్టమర్లపై మోపుతాయి. అయితే ఇది ఖాతాదారులపై ఏమేర ప్రభావం చూపుతుందన్నది తెలియాల్సి ఉంది.
59
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దాదాపు గడిచిన 10 ఏళ్లలో ఇంటర్ఛేంజ్ ఫీజు ఎప్పుడు మారినా, దాని ప్రభావం నేరుగా కస్టమర్లపై పడింది. దీంతో ఈ సారి కూడా ఖాతాదారుల జేబులకు చిల్లు పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
69
ఈసారి కూడా బ్యాంకులు ఈ ఇంటర్ ఛేంజ్ డబ్బులను ఖాతాదారులపై మోపే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ అదనపు ఛార్జీలను ఖాతాదారులపై మోపనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
79
ప్రస్తుతం ఏటీఎమ్ లావాదేవీల ఛార్జీల విషయానికొస్తే.. ఫైనాన్షియల్ లావాదేవీలకు రెండు రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు రూపాయి అదనంగా పెంచారు.
89
అయితే మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం, ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే డబ్బులు తీసుకోవడానికి ఇంటర్ఛేంజ్ ఫీజును రూ. 17 నుంచి రూ. 19కి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
99
అదనంగా, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా ఏదైనా ఇతర సర్వీసుకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ. 6 నుంచి రూ. 7కి పెంచే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.