Business Idea: రూ. లక్ష పెట్టుబ‌డితో నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించే అవ‌కాశం.. ఎప్ప‌టికీ డిమాండ్ త‌గ్గ‌ని బిజినెస్ ఐడియా

Published : Jul 14, 2025, 04:57 PM IST

ముందు ఉద్యోగం, ఆ త‌ర్వాత వ్యాపారం.. ఒక‌ప్పుడు యువ‌త ఆలోచ‌న ఇలా ఉండేది. అయితే ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా యువ‌త ఆలోచ‌న కూడా మారుతోంది. చ‌దువు పూర్తికాగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారి కోస‌మే ఒక మంచి బిజినెస్ ఐడియా.. 

PREV
15
ఖాళీ సీసాల‌తో కాసుల వ‌ర్షం

ప్ర‌స్తుతం భార‌త దేశంలో స‌గ‌టున రోజుకు కోటిన్నర గ్లాస్ బాటిల్స్ వేస్టేజ్ అవుతున్నాయి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఇలా రకరకాల సీసాలు పేరుకుపోతున్నాయి. అయితే ఈ వేస్టేజ్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకుంటే ల‌క్ష‌ల్లో ఆదాయం ల‌భిస్తుంది. ఖాళీ గ్లాస్ బాటిల్స్‌ను సేకరించి రీసైక్లింగ్‌ ద్వారా క్రిస్టల్స్‌గా మార్చే వ్యాపారంతో భారీగా లాభాలు ఆర్జించ‌వ‌చ్చు.

25
వ్యాపారం ఎలా ప్రారంభించాలి?

ఈ వ్యాపారం కోసం ప్రధానంగా అవసరమయ్యే యంత్రం గ్లాస్ బాటిల్‌ పౌడరింగ్ మిషన్. ఇది మార్కెట్లో రూ. 50,000 నుంచి రూ. 2,00,000 మధ్య లభిస్తుంది. మొదట స్టార్టప్ స్టేజ్‌లో ఉంటే రూ. 75,000 - రూ. 1 లక్షతో మిషన్ తీసుకోవచ్చు. బాటిల్స్‌ను సేకరించేందుకు స్క్రాప్ డీలర్లతో, స్థానిక వైన్ షాప్స్ లేదా బార్లతో ఒప్పందం చేసుకోవచ్చు. రోజుకు కనీసం 300-400 బాటిల్స్ సేకరించగలిగితే, ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతుంది.

35
బాటిల్స్ నుంచి క్రిస్టల్స్ వరకు

సేకరించిన గ్లాస్ బాటిల్స్‌ను మొదట శుభ్రంగా కడిగి, మిషన్‌లో వేస్తారు. ఆ యంత్రం వాటిని చిన్న చిన్న గాజు ముక్కలుగా అంటే "గ్లాస్ క్రిస్టల్స్"గా మార్చుతుంది. ఇవి నిర్మాణ రంగం, గాజు తయారీ సంస్థలు, డెకరేటివ్ వస్తువుల తయారీ కంపెనీలకు అవసరమయ్యే ప్రధాన ముడి పదార్థంగా ప‌నిచేస్తుంది.

45
పెట్టుబ‌డి ఎంత‌.?

ఈ వ్యాపారానికి ప్రాథమికంగా రూ. 1.5 లక్షల లోపు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మిషన్, రవాణా, బాటిల్స్ కొనుగోలు, కార్మిక ఖర్చులతో సహా ప్రతి టన్ను గ్లాస్ క్రిస్టల్స్ తయారీకి సగటున రూ. 3,000 ఖర్చు అవుతుంది.

అదే టన్నును మార్కెట్లో రూ. 8,000 వరకు విక్రయించవచ్చు. అంటే టన్నుకు రూ. 5,000 నికర లాభం. నెలలో కనీసం 20 టన్నులు అమ్మగలిగితే, రూ. లక్ష లాభం ఆర్జించవచ్చు. మార్కెట్ అవసరాన్ని బట్టి మరింతగా పెంచుకోవచ్చు.

55
మార్కెట్ డిమాండ్

గాజు మళ్లీ పునర్వినియోగానికి అనువైన పదార్థం కావడంతో, దీన్ని ఉపయోగించే పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. గ్లాస్ కంపెనీలు, ఫర్నిచర్ డిజైన్ సంస్థలు, కాంక్రీట్ మిశ్రమ తయారీ సంస్థలకి ఈ క్రిస్టల్స్‌పై స్థిరమైన డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లతో, బిల్డింగ్ మెటీరియల్స్ షాప్స్‌తో ఒప్పంతం చేసుకోవ‌డం ద్వారా మార్కెట్‌ను విస్తరించుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories