Gold Price: ఈ బంగారం ఏంటి గురూ అస్స‌లు అర్థమ‌వ్వ‌ట్లే.. తాజా ధ‌ర‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Jul 14, 2025, 12:37 PM IST

భార‌తీయుల‌ను, బంగారాన్ని విడ‌దీసి చూడలేం. కేవ‌లం ఆడంబ‌రానికి మాత్ర‌మే కాకుండా పెట్టుబ‌డిగా కూడా బంగారాన్ని చాలా మంది చూస్తుంటారు. అందుకే బంగారం ధ‌రకు సంబంధించి ఆస‌క్తి చూపిస్తుంటారు. 

PREV
15
భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ఇటీవ‌ల బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు బంగారం ధ‌రలు క్ర‌మంగా త‌గ్గాయి. ఒకానొక స‌మ‌యంలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 98 వేల‌కు దిగొచ్చింది. దీంతో గోల్డ్ రేట్స్ భారీగా త‌గ్గ‌నున్నాయ‌ని అంతా సంతోషించారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు.

బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌క‌పోగా మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించింది. తాజాగా తులం బంగారం ధ‌ర మ‌ళ్లీ ల‌క్ష మార్క్ వైపు దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలో దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో సోమ‌వారం తులం బంగారం ధ‌ర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

25
దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధర‌లు

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100030కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 99,880గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,550గా ఉంది.

* చెన్నైలో సోమ‌వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,880గా ఉండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 91,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఈ న‌గ‌రంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,880గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 91,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

35
తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 99,880గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 99,880గా ఉండ‌గా, 22 క్యారెట్ల ధ‌ర రూ. 91,550 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విశాఖ‌ప‌ట్నం విష‌యానికొస్తే ఈ నగ‌రంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 99,800గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 91,550గా ఉంది.

45
బంగారం ధ‌ర‌లు ఇంకా పెర‌గ‌నున్నాయా.?

తులం బంగారం ధ‌ర మ‌ళ్లీ రూ. ల‌క్ష‌కు చేరువుతోన్న త‌రుణంలో ధ‌ర‌లు ఇంకా పెర‌గ‌నున్నాయా.? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే గోల్డ్ ల‌వ‌ర్స్‌కి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.

55
వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

వెండి ధ‌ర‌లు కూడా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. దేశంలోని కొన్ని న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. ల‌క్ష 25 వేలు దాటేసింది. ఢిల్లీతో పాటు ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 1,15,000గా ఉండ‌గా.. చెన్నై, హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌లో కిలో వెండి ధ‌ర ఏకంగా రూ. 1,25,000 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories