Credit card: ఈ క్రెడిట్ కార్డు లిమిట్ అక్ష‌రాల రూ. 10 కోట్లు.. ఏడాది ఛార్జీలే రూ. 2.75 లక్షలు

Published : Jul 14, 2025, 02:19 PM IST

ప్ర‌స్తుతం క్రెడిట్ వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ క్రెడిట్ కార్డు ఉంటోన్న రోజులివీ. అయితే రూ. 10 కోట్ల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ ఉన్న కార్డు గురించి మీకు తెలుసా.?  

PREV
15
పెరుగుతోన్న క్రెడిట్ వినియోగం

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఒక‌ప్పుడు క్రెడిట్ కార్డు రావ‌డం అంటే ఎంతో క‌ష్టంతో కూడుకున్న అంశం కానీ ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర ఒకటికి మించి ఎక్కువ కార్డులు ఉంటున్నాయి. డిస్కౌంట్లు, రివార్డ్స్, లాంజ్ యాక్సెస్ వంటి ప్రత్యేకతలతో కార్డులు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే కొన్ని సంస్థ‌లు సైతం ఆఫ‌ర్ల‌ను అందిస్తుంటాయి. ప్ర‌పంచంలోనే అత్యంత ప్రీమియం క్రెడిట్ కార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

25
ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం క్రెడిట్ కార్డు

అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్ (American Express Centurion Card), అలాంటి కార్డులో అగ్రస్థానంలో ఉంది. దీన్ని సాధారణంగా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. ఇది ఓ ప్రీమియం మేట్ మెటల్ కార్డు. ఈ కార్డును ప్ర‌త్యేకంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కేవలం ఆహ్వానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1 లక్ష మంది వ‌ద్ద మాత్ర‌మే ఈ కార్డు ఉంది. భారతదేశంలో అయితే కేవలం 200 మంది మాత్రమే ఈ కార్డు హోల్డర్స్‌గా ఉన్నారు.

35
ఎవ‌రు అర్హులు.?

ఈ కార్డు పొందాల‌నుకుంటే సాధారణ సంపాదనతో సరిపోదు. సంవత్సరానికి కనీసం రూ.10 కోట్లు వరకు ఖర్చు చేయగల సామర్థ్యం ఉండాలి. అలాగే, పర్సనల్ బ్రాండ్, ఖరీదైన లైఫ్‌స్టైల్ వంటి అర్హ‌త‌లు ఉండాలి. ఈ క్రెడిట్ కార్డు అత్యంత సంప‌న్నుల కోసం కేటాయించారు.

45
కార్డు ప్ర‌యోజ‌నాలు ఏంటి.?

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్ ద్వారా ప్రైవేట్ జెట్ బుకింగ్‌లు, ప్రపంచంలోని ప్రీమియం హోటళ్లలో ప్రత్యేక సేవలు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ఎక్స్‌క్లూజివ్ ట్రీట్‌మెంట్, పర్సనల్ లైఫ్‌స్టైల్ మేనేజర్ వంటి అనేక లగ్జరీ ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఏవెన్స్‌కు ప్రైవేట్ యాక్సెస్, ప్రపంచ స్థాయి బ్రాండ్‌ల నుంచి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుతాయి.

55
ఫీజుల వివరాలు

ఈ కార్డు ఖర్చు కూడా లగ్జరీ స్థాయిలోనే ఉంటుంది. ఇనీషియేషన్ ఫీజు: రూ. 7 లక్షలు, జాయినింగ్ ఫీజు: రూ. 2.75 లక్షలు, జీఎస్టీతో కలుపుకొని మొదటి ఏడాది మొత్త ఖర్చు: సుమారు రూ. 11.5 లక్షలు అవుతాయి. ప్రతి ఏడాది వార్షిక రుసుము: రూ. 2.75 లక్షలు + జీఎస్టీ (మొత్తం సుమారు రూ. 3.24 లక్షలు) అవుతుంది. ఈ ఛార్జీలను బ‌ట్టే ఈ కార్డు ఎంత ప్ర‌త్యేక‌మో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తం మీద ఈ కార్డు పొందాలంటే.. డబ్బు మాత్రమే కాకుండా, లైఫ్‌స్టైల్, ఖర్చుల శైలి, ప్రీమియం ప్రెజెన్స్ అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories